Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • రైతు బిడ్డ నుంచి రాకెట్ శాస్త్రవేత్తగా.. విక్రమ్-1 విజయానికి తెలుగు యువకుడి సంతకం!

    రైతు బిడ్డ నుంచి రాకెట్ శాస్త్రవేత్తగా.. విక్రమ్-1 విజయానికి తెలుగు యువకుడి సంతకం!

    ఖమ్మం, 2026 జూలై 21:

    ఖమ్మం గ్రామం నుంచి అంతరిక్ష రంగానికి.. స్కైరూట్‌ విజయగాథలో నరేందర్ రెడ్డి కీలక పాత్ర

    కలలు కనడానికి నగరంలో పుట్టాల్సిన అవసరం లేదని, సంకల్పం ఉంటే గ్రామీణ యువత కూడా అంతరిక్షాన్ని తాకగలదని మరోసారి నిరూపించారు ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం మాధాపురం గ్రామానికి చెందిన మోర్తాల నరేందర్ రెడ్డి. భారత్‌లో తొలి ప్రైవేటు ఆర్బిటల్ క్లాస్ రాకెట్ 'విక్రమ్-1 (మిషన్ ఆగమన్)' విజయవంతమైన ప్రయోగంలో ఆయన కీలక పాత్ర పోషించి తెలుగు రాష్ట్రాల గర్వకారణంగా నిలిచారు.

    ఇవి కూడా చదవండి

    హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్పేస్‌టెక్ సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్లో గత ఐదున్నరేళ్లుగా పనిచేస్తున్న నరేందర్ రెడ్డి ప్రస్తుతం ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ టీమ్ లీడర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 20 మంది సభ్యులతో కూడిన బృందానికి నాయకత్వం వహిస్తూ రాకెట్ అసెంబ్లీ, లిక్విడ్ ప్రొపల్షన్ వ్యవస్థలు, పరీక్షలు, ప్రయోగానికి ముందు నిర్వహించే కీలక సాంకేతిక ప్రక్రియలను సమన్వయం చేశారు.

    విక్రమ్-1 విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లడంలో ఆయన బృందం చేసిన కృషి ప్రత్యేక గుర్తింపు పొందింది. స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన ఈ ప్రయోగం భారత అంతరిక్ష రంగంలో కొత్త అధ్యాయానికి నాంది పలకగా, ఆ చారిత్రక విజయగాథలో ఒక తెలుగు యువకుడు భాగస్వామి కావడం విశేషంగా మారింది.

    తన ప్రయాణం ఇంకా కొనసాగుతుందని, భవిష్యత్తులో భారత అంతరిక్ష రంగానికి మరింత సేవలందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు నరేందర్ రెడ్డి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే యువత విజ్ఞాన శాస్త్ర రంగంలో పెద్ద లక్ష్యాలను సాధించగలరనే నమ్మకాన్ని కల్పించడమే తన ఆశయమని చెప్పారు.

    మాధాపురం గ్రామానికి చెందిన రైతు కుటుంబం నుంచి ఎదిగి దేశ గర్వకారణమైన అంతరిక్ష ప్రాజెక్టులో కీలక బాధ్యతలు నిర్వహించిన నరేందర్ రెడ్డిపై గ్రామస్థులు, స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. "పల్లె నుంచి ప్రయోగ వేదిక వరకు" ఆయన చేసిన ఈ ప్రయాణం నేటి యువతకు స్ఫూర్తిదాయకమైన విజయగాథగా నిలుస్తోంది.

    అత్యధికంగా చదివినవి