రైతు బిడ్డ నుంచి రాకెట్ శాస్త్రవేత్తగా.. విక్రమ్-1 విజయానికి తెలుగు యువకుడి సంతకం!

ఖమ్మం, 2026 జూలై 21: ఖమ్మం గ్రామం నుంచి అంతరిక్ష రంగానికి.. స్కైరూట్‌ విజయగాథలో నరేందర్ రెడ్డి కీలక పాత్ర కలలు కనడానికి నగరంలో పుట్టాల్సిన అవసరం లేదని, సంకల్పం ఉంటే గ్రామీణ యువత కూడా అంతరిక్షాన్ని తాకగలదని మరోసారి నిరూపించారు ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం మాధాపురం గ్రామానికి చెందిన మోర్తాల నరేందర్ రెడ్డి. భారత్‌లో తొలి ప్రైవేటు ఆర్బిటల్ క్లాస్ రాకెట్ 'విక్రమ్-1 (మిషన్ ఆగమన్)' విజయవంతమైన ప్రయోగంలో ఆయన కీలక పాత్ర పోషించి తెలుగు రాష్ట్రాల గర్వకారణంగా నిలిచారు. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్పేస్‌టెక్ సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్లో గత ఐదున్నరేళ్లుగా పనిచేస్తున్న నరేందర్ రెడ్డి ప్రస్తుతం ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్...