Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఎస్. టి. కాలనీలో సికిల్ సెల్ అనీమియా, టి. బి. అవగాహనా సదస్సు. డిప్యూటీ హెచ్. ఈ. ఓ. మహమ్మద్ రఫీ..

    ఎస్. టి. కాలనీలో  సికిల్ సెల్ అనీమియా, టి. బి. అవగాహనా సదస్సు. డిప్యూటీ హెచ్. ఈ. ఓ. మహమ్మద్ రఫీ..

    మండల కేంద్రం లోని ఎస్. టి. కాలనీలో మెడిక్కుర్తి పి. హెచ్. సి వైద్యులు డాక్టర్ లక్ష్మీ ప్రసన్న ఆధ్వర్యంలో ఘనంగా సికిల్ సెల్ అనీమియా,టి. బి, స్టాప్ డయేరియా, డెంగీ వ్యాధులపై అవగాహనా సదస్సు నిర్వహించడం జరిగింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖధికారి వారి ఆదేశాల మేరకు డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ. 104సేవలలో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ సందర్బంగా డి. హెచ్. ఈ. ఓ. మహమ్మద్ రఫీ మాట్లాడుచు సికెల్ సెల్ అనీమియా రక్తపరీక్షలు ఎస్. టి. కాలనీ లోని 40సంవత్సరాలలోపు ప్రజలు అందరు చేయించుకోవాలని అన్నారు. సికిల్ సెల్ రక్తహీనత పై 2047సంవత్సరానికి సికిల్ సెల్ అనీమియా నిర్మూలన మిషన్ లో భాగంగా అవగాహన కల్పించి కరపత్రాలు పంపిణీ చేశారు. సికెల్ సెల్ అనీమియా వ్యాధి వారస్వతంగా వచ్చే ఎర్ర రక్తకణముల వ్యాధి. ఈ జబ్బు తల్లిదండ్రుల నుండి జన్యుపరంగా పిల్లలకు వస్తుంది. సికిల్ సెల్ ఎనిమియా వ్యాధి లక్షణాలు రక్తకణాల సంఖ్య తగ్గడం, కళ్ళు పసుపు రంగు లోకి మారడం, తీవ్రమైన వళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు, శ్వాస తీసుకోవడం లో కష్టం, అలసట, తరచుగా వచ్చే అంటువ్యాధులు, గర్భ ధారణ సమయం లో సమస్యలు, అవయవ వైపల్యం, పెరుగుదల సమస్యలు. ఈ వ్యాధి నిర్ధారణ కొరకు ప్రతీ ఆరోగ్య కార్యకర్త దగ్గర పరీక్ష కిట్స్ అందుబాటులో ఉన్నాయి. ఒక్క చుక్క రక్తం తో పరీక్ష చేసుకోవచ్చు. సున్నా నుండి 40సంవత్సరాల లోపు గిరిజనులు పరీక్షలు చేసుకోవాలి. వ్యాధి నిర్ధారణ ఐతే హైద్రాక్సీ యూరియా మాత్రలు తో పాటు ఫోలిక్ ఆసిడ్ మాత్రలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అవసరం ఐతే రక్తం ఎక్కించాలిసి వస్తుంది.వివాహనికి ముందు అమ్మాయి, అబ్బాయి ఇద్దరు సికిల్ సెల్ రక్త పరీక్షలు చేయించుకోవాళన్నారు. ప్రతీ సచివాలయం లో ఉన్న ఆరోగ్య కార్యకర్తల దగ్గర కిట్ అందుబాటులో ఉన్నాయని ప్రజలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాళన్నారు.వ్యాధి యొక్క స్థాయి ని బట్టి ఎముక మజ్జ మార్చబడుతుంది అన్నారు.టి. బి. ముక్త్ భారత్ లో యువత భాగస్వామ్యం అవసరం ఎంతైనా ఉందని అన్నారు. టి. బి. లక్షణాలు గల వారికి నిర్ధారణ పరీక్షలు, చికిత్స పూర్తిగా ఉచితంగా అందుబాటులో ఉన్నాయని అన్నారు.ప్రజల చేత నినాదాలు చేస్తూ ప్లేకార్డ్స్ ప్రదర్శన చేయడం జరిగింది. ప్రజల భాగస్వామ్యం తో టి. బి. ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. స్టాప్ డయేరియా, డెంగీ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచించారు.ఈ కార్యక్రమం లో డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ, పర్యవేక్షకులు గిరిజమ్మ ఎమ్. ఎల్. హెచ్. పి షహీరా బాను ఏ. ఎన్. ఎమ్ రమాదేవి , ఆశాకార్యకర్తలు అరుణ, ధనలక్ష్మి, 104 సిబ్బంది పాల్గొన్నారు.

    అత్యధికంగా చదివినవి