Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • అరుంధతివాడ స్మశానవాటిక భూమిని పరిరక్షించాలి: ఎండీపీఎస్

    Author RAJANEETHI | 20 Jul 2026, 05:19 PM | ANDHRA PRADESH
    అరుంధతివాడ స్మశానవాటిక భూమిని పరిరక్షించాలి: ఎండీపీఎస్

    తిరుపతి, జూలై 20 (రాజనీతి): పెనగలూరు మండలం పాతపల్లి అరుంధతివాడకు కేటాయించిన 71 సెంట్ల స్మశానవాటిక భూమిని సర్వే చేసి ఆక్రమణల నుంచి విముక్తి కల్పించాలని ఎండీపీఎస్ నాయకులు జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ)ను కోరారు. గత 150 ఏళ్లుగా వినియోగిస్తున్న స్మశానవాటికను కొందరు ఆక్రమించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు. భూమిని కొలిపించి గ్రామానికి అప్పగించేలా చర్యలు తీసుకోవాలని ఎండీపీఎస్ రాష్ట్ర కోర్ కమిటీ ప్రధాన కార్యదర్శి పురుషోత్తం తదితర నాయకులు విజ్ఞప్తి చేశారు.

    అత్యధికంగా చదివినవి