Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • బ్రాహ్మణపల్లిలో రూ.18.30 లక్షల సీసీ రోడ్డు ప్రారంభించిన ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్...

    Author RAJANEETHI | 20 Jul 2026, 03:09 PM | ANDHRA PRADESH
    బ్రాహ్మణపల్లిలో రూ.18.30 లక్షల సీసీ రోడ్డు ప్రారంభించిన ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్...

    పర్యాటక కేంద్రంగా చిత్తూరు ను తీర్చిదిద్దుతాం.. అమ్మవారి ఆలయానికి మెరుగైన దారి:ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్

    స్థానిక ఎన్నికల్లో కూటమికి మద్దతివ్వండి.. రెట్టింపు అభివృద్ధి చేస్తాం:ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్...

    ఇవి కూడా చదవండి

    చిత్తూరు (జర్నలిస్ట్ జ్ఞాన ప్రకాష్): చిత్తూరు నగరాన్ని మౌలిక వసతులతో పాటు పర్యాటక రంగంలోనూ అభివృద్ధి చేసి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తెలిపారు. నగరంలోని ప్రతి వార్డులో ప్రజలకు అవసరమైన రహదారులు,డ్రైనేజీలు, తాగునీటి సదుపాయాలు, విద్యుత్ వంటి మౌలిక వసతులను మెరుగుపరుస్తూనే పర్యాటక అవకాశాలు ఉన్న ప్రాంతాలను అభివృద్ధి చేసే దిశగా కార్యాచరణ చేపట్టామని చెప్పారు. సోమవారం చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలోని 49వ వార్డు బ్రాహ్మణపల్లిలో రూ.18.30 లక్షల వ్యయంతో నిర్మించిన సిమెంట్ రోడ్డును ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన రోడ్డును పరిశీలించి స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.రహదారి నిర్మాణంతో ఎన్నో ఏళ్లుగా ఎదురవుతున్న ఇబ్బందులు తొలగిపోతాయని స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ....బ్రాహ్మణపల్లి సమీపంలోని అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన దారి సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆలయ పరిసర ప్రాంతాన్ని పర్యాటక దృష్ట్యా అభివృద్ధి చేసి భక్తులు సందర్శకులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. చిత్తూరులో ఉన్న ఆధ్యాత్మిక,చారిత్రక ప్రాధాన్యం కలిగిన ప్రాంతాలను అభివృద్ధి చేయడం ద్వారా పర్యాటక రంగానికి ఊతమిచ్చే ప్రయత్నం జరుగుతోందన్నారు.రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అభివృద్ధి పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రహదారులు, విద్య, వైద్యం, తాగునీరు, పారిశుద్ధ్యం, ఉపాధి కల్పన వంటి అన్ని రంగాల్లో కూటమి ప్రభుత్వం ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కట్టుబడి ఉందన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతూ ప్రతి ప్రాంతానికి సమాన ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కూటమి అభ్యర్థులను ఆశీర్వదించాలని ప్రజల మద్దతు లభిస్తే చిత్తూరు నగరంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసి రెట్టింపు అభివృద్ధిని సాధిస్తామని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు. అభివృద్ధే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రజల సహకారంతో చిత్తూరును ఆదర్శ నగరంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.కొత్త సీసీ రోడ్డు నిర్మాణంతో బ్రాహ్మణపల్లి ప్రాంతంలో రాకపోకలు మరింత సులభతరం అవుతాయని స్థానికులు అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో చుడా చైర్‌పర్సన్ కటారి హేమలత, నగరపాలక సంస్థ కమిషనర్ పి. నరసింహ ప్రసాద్, మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ త్యాగరాజన్, కూటమి నాయకులు అముద, రాజేష్ రెడ్డి, లోకేష్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

    అత్యధికంగా చదివినవి