బ్రాహ్మణపల్లిలో రూ.18.30 లక్షల సీసీ రోడ్డు ప్రారంభించిన ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్...

పర్యాటక కేంద్రంగా చిత్తూరు ను తీర్చిదిద్దుతాం.. అమ్మవారి ఆలయానికి మెరుగైన దారి:ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ స్థానిక ఎన్నికల్లో కూటమికి మద్దతివ్వండి.. రెట్టింపు అభివృద్ధి చేస్తాం:ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్... చిత్తూరు (జర్నలిస్ట్ జ్ఞాన ప్రకాష్): చిత్తూరు నగరాన్ని మౌలిక వసతులతో పాటు పర్యాటక రంగంలోనూ అభివృద్ధి చేసి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తెలిపారు. నగరంలోని ప్రతి వార్డులో ప్రజలకు అవసరమైన రహదారులు,డ్రైనేజీలు, తాగునీటి సదుపాయాలు, విద్యుత్ వంటి మౌలిక వసతులను మెరుగుపరుస్తూనే పర్యాటక అవకాశాలు ఉన్న ప్రాంతాలను అభివృద్ధి చేసే దిశగా కార్యాచరణ చేపట్టామని చెప్పారు. సోమవారం చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలోని 49వ వార్డు...