Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • జీవో 396 రద్దు చేయాలని దస్తావేజు లేఖరుల పెన్‌డౌన్

    Author RAJANEETHI | 20 Jul 2026, 12:14 PM | ANDHRA PRADESH
    జీవో 396 రద్దు చేయాలని దస్తావేజు లేఖరుల పెన్‌డౌన్

    రేణిగుంట, జూలై 20 (రాజనీతి): రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.396ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం పిలుపు మేరకు రేణిగుంటలో సోమవారం దస్తావేజు లేఖరులు పెన్‌డౌన్ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ నెల 31 వరకు 12 రోజుల పాటు నిరసన కొనసాగుతుందని తెలిపారు. దస్తావేజుల తయారీని ప్రైవేట్ సేవా కేంద్రాలకు అప్పగించడం వల్ల వేలాది మంది దస్తావేజు లేఖరుల జీవనోపాధి ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పునరాలోచన చేసి జీవో 396ను వెంటనే రద్దు చేయాలని, ప్రజలు తమ ఉద్యమానికి సహకరించాలని కోరారు.

    అత్యధికంగా చదివినవి