Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • మదనపల్లె మున్సిపాలిటీకి రాష్ట్రస్థాయి గుర్తింపు.. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అవార్డు అందుకున్న కమిషనర్ ప్రమీల

    Author RAJANEETHI | 18 Jul 2026, 06:51 PM | ANDHRA PRADESH, ఆంధ్రప్రదేశ్
    మదనపల్లె మున్సిపాలిటీకి రాష్ట్రస్థాయి గుర్తింపు.. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అవార్డు అందుకున్న కమిషనర్ ప్రమీల

    'ఆపరేషన్ క్లీన్ స్వీప్'లో ఉత్తమ ప్రతిభ.. రాష్ట్రంలోని అత్యుత్తమ 9 మున్సిపాలిటీల్లో మదనపల్లెకు స్థానం

    మదనపల్లె, జూలై 18:

    పరిశుభ్రమైన పట్టణ నిర్మాణంలో విశిష్ట ప్రతిభ కనబరిచిన మదనపల్లె మున్సిపాలిటీకి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ఆపరేషన్ క్లీన్ స్వీప్' కార్యక్రమంలో రాష్ట్రస్థాయి గుర్తింపు లభించింది. ఈ సందర్భంగా విజయవాడలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా మదనపల్లె మున్సిపల్ కమిషనర్ ప్రమీల అవార్డు, షీల్డ్‌ను అందుకున్నారు.

    ఇవి కూడా చదవండి

    రాష్ట్రవ్యాప్తంగా 2025 మే 23 నుంచి నెల రోజులపాటు నిర్వహించిన 'ఆపరేషన్ క్లీన్ స్వీప్' కార్యక్రమంలో 123 మున్సిపాలిటీలను పరిశీలించగా, ఉత్తమ పనితీరు కనబరిచిన 9 మున్సిపాలిటీలకు మాత్రమే ఈ ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. అందులో మదనపల్లె మున్సిపాలిటీ స్థానం సంపాదించడం విశేషంగా నిలిచింది.

    పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణ, ప్రజల భాగస్వామ్యం, పట్టణ పారిశుధ్య నిర్వహణలో మున్సిపల్ యంత్రాంగం సమిష్టిగా చేసిన కృషికి గుర్తింపుగానే ఈ అవార్డు లభించినట్లు అధికారులు తెలిపారు.

    మదనపల్లె మున్సిపాలిటీకి ఈ అరుదైన గౌరవం దక్కడంపై మహిళా సంఘాల ప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది కమిషనర్ ప్రమీలకు అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.

    అత్యధికంగా చదివినవి