మదనపల్లె మున్సిపాలిటీకి రాష్ట్రస్థాయి గుర్తింపు.. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అవార్డు అందుకున్న కమిషనర్ ప్రమీల

'ఆపరేషన్ క్లీన్ స్వీప్'లో ఉత్తమ ప్రతిభ.. రాష్ట్రంలోని అత్యుత్తమ 9 మున్సిపాలిటీల్లో మదనపల్లెకు స్థానం మదనపల్లె, జూలై 18: పరిశుభ్రమైన పట్టణ నిర్మాణంలో విశిష్ట ప్రతిభ కనబరిచిన మదనపల్లె మున్సిపాలిటీకి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ఆపరేషన్ క్లీన్ స్వీప్' కార్యక్రమంలో రాష్ట్రస్థాయి గుర్తింపు లభించింది. ఈ సందర్భంగా విజయవాడలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా మదనపల్లె మున్సిపల్ కమిషనర్ ప్రమీల అవార్డు, షీల్డ్‌ను అందుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2025 మే 23 నుంచి నెల రోజులపాటు నిర్వహించిన 'ఆపరేషన్ క్లీన్ స్వీప్' కార్యక్రమంలో 123 మున్సిపాలిటీలను పరిశీలించగా, ఉత్తమ పనితీరు కనబరిచిన 9 మున్సిపాలిటీలకు మాత్రమే ఈ ప్రతిష్టాత్మక...