Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • డెంగీపై దండయాత్ర.. చిత్తూరులో ఫ్రైడే డ్రైడే ప్రత్యేక కార్యక్రమాలు

    Author RAJANEETHI | 17 Jul 2026, 09:24 PM | ANDHRA PRADESH
    డెంగీపై దండయాత్ర.. చిత్తూరులో ఫ్రైడే డ్రైడే ప్రత్యేక కార్యక్రమాలు

    ఇంటిింటి ఫీవర్ సర్వే.. లార్వాల నిర్మూలనకు నగరపాలక చర్యలు...


    సీజనల్ వ్యాధుల నివారణే లక్ష్యం.. ప్రజలతో ప్రతిజ్ఞ చేయించిన అధికారులు...

    ఇవి కూడా చదవండి

    చిత్తూరు(జర్నలిస్ట్ జ్ఞాన ప్రకాష్): డెంగీ వ్యాప్తిని అరికట్టేందుకు చిత్తూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం "డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవాలు"లో భాగంగా ఫ్రైడే డ్రైడే కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించారు. నగరపాలక కమిషనర్ పి. నరసింహ ప్రసాద్ మార్గనిర్దేశంలో స్వర్ణ వార్డు కార్యదర్శులు తమ తమ వార్డుల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన పెంపొందించడంతో పాటు డెంగీ దోమల పెరుగుదలకు అనుకూల పరిస్థితులను తొలగించేందుకు చర్యలు తీసుకున్నారు.28వ వార్డు షావుకారుపేట ప్రాంతంలో అధికారులు ఇంటింటికీ వెళ్లి ఫీవర్ సర్వే నిర్వహించారు. జ్వరం లక్షణాలు ఉన్న వారి వివరాలను సేకరించి, అవసరమైన వైద్య సూచనలు అందించారు. అదే సమయంలో లార్వాల గుర్తింపు సర్వే నిర్వహించి, నీరు నిల్వ ఉన్న పాత్రలు, ట్యాంకులు, కూలర్లు, ఇతర ప్రదేశాలను పరిశీలించారు. లార్వాలు గుర్తించిన ప్రాంతాల్లో వెంటనే అబేట్ ద్రావణాన్ని పిచికారీ చేసి దోమల ఉత్పత్తిని నియంత్రించే చర్యలు చేపట్టారు.డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవాల సందర్భంగా ప్రజలకు డెంగీ, మలేరియా, చికున్‌గున్యా వంటి సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలని, వారానికి ఒక రోజు "ఫ్రైడే డ్రైడే"గా పాటిస్తూ నీటి పాత్రలను పూర్తిగా ఖాళీ చేసి శుభ్రం చేయాలని సూచించారు. పూర్తి చేతుల దుస్తులు ధరించడం, దోమతెరలు ఉపయోగించడం, జ్వరం వచ్చిన వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించడం వంటి జాగ్రత్తలను వివరించారు. అనంతరం డెంగీ నివారణలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వర్తిస్తామని ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో మలేరియా అర్బన్ యూనిట్ ఆఫీసర్ రామకృష్ణ, శానిటరీ ఇన్స్పెక్టర్లు, స్వర్ణ వార్డు కార్యదర్శులు, పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. నగరాన్ని డెంగీ రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రజల సహకారం ఎంతో అవసరమని అధికారులు పేర్కొన్నారు. ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమాలను తప్పనిసరిగా పాటిస్తే డెంగీ వ్యాప్తిని సమర్థవంతంగా అరికట్టవచ్చని సూచించారు.

    అత్యధికంగా చదివినవి