డెంగీపై దండయాత్ర.. చిత్తూరులో ఫ్రైడే డ్రైడే ప్రత్యేక కార్యక్రమాలు

ఇంటిింటి ఫీవర్ సర్వే.. లార్వాల నిర్మూలనకు నగరపాలక చర్యలు... సీజనల్ వ్యాధుల నివారణే లక్ష్యం.. ప్రజలతో ప్రతిజ్ఞ చేయించిన అధికారులు... చిత్తూరు(జర్నలిస్ట్ జ్ఞాన ప్రకాష్): డెంగీ వ్యాప్తిని అరికట్టేందుకు చిత్తూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం "డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవాలు"లో భాగంగా ఫ్రైడే డ్రైడే కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించారు. నగరపాలక కమిషనర్ పి. నరసింహ ప్రసాద్ మార్గనిర్దేశంలో స్వర్ణ వార్డు కార్యదర్శులు తమ తమ వార్డుల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన పెంపొందించడంతో పాటు డెంగీ దోమల పెరుగుదలకు అనుకూల పరిస్థితులను తొలగించేందుకు చర్యలు తీసుకున్నారు.28వ వార్డు షావుకారుపేట ప్రాంతంలో అధికారులు ఇంటింటికీ వెళ్లి ఫీవర్ సర్వే నిర్వహించారు. జ్వరం లక్షణాలు...