Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • రోడ్డు ప్రమాదంలో ద్విచక్రవాహనదారుడికి తీవ్ర గాయాలు

    Author RAJANEETHI | 17 Jul 2026, 03:44 PM | ANDHRA PRADESH
    రోడ్డు ప్రమాదంలో ద్విచక్రవాహనదారుడికి తీవ్ర గాయాలు

    పుంగనూరు, జూలై 17 (రాజనీతి): అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలోని భగత్‌సింగ్ కాలనీ మలుపు వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్రవాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు. మదనపల్లి రోడ్డునుంచి పలమనేరు వైపు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వ్యక్తి కాలు విరిగినట్లు సమాచారం. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించి బాధితుడిని పుంగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితుడు తమిళనాడుకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

    అత్యధికంగా చదివినవి