రోడ్డు ప్రమాదంలో ద్విచక్రవాహనదారుడికి తీవ్ర గాయాలు
పుంగనూరు, జూలై 17 (రాజనీతి): అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలోని భగత్‌సింగ్ కాలనీ మలుపు వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్రవాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు. మదనపల్లి రోడ్డునుంచి పలమనేరు వైపు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వ్యక్తి కాలు విరిగినట్లు సమాచారం. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించి బాధితుడిని పుంగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితుడు తమిళనాడుకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.