Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • అభివృద్ధితో పాటు ప్రజల ఆరోగ్యానికీ ప్రాధాన్యం: ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్

    Author RAJANEETHI | 17 Jul 2026, 01:51 PM | ANDHRA PRADESH
    అభివృద్ధితో పాటు ప్రజల ఆరోగ్యానికీ ప్రాధాన్యం: ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్

    చిత్తూరులో రూ.88 లక్షల పట్టణ ఆరోగ్య కేంద్రం ప్రారంభం...

    రోడ్ల విస్తరణ, మౌలిక వసతులతో చిత్తూరు ట్రాన్సిట్ హబ్‌ గా ఎదుగుతుంది...

    ఇవి కూడా చదవండి

    చిత్తూరు,(జర్నలిస్ట్ జ్ఞాన ప్రకాష్):రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధితో పాటు ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ అన్నారు. చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలోని ప్రశాంత్‌నగర్‌ లో చంద్రబాబు నాయుడు కాలనీలో రూ.88 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వివిధ విభాగాలను ప్రారంభించడంతో పాటు ఆవరణలో మొక్క నాటి నీరు పోశారు.ఈ సందర్భంగా నిర్వహించిన సభలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ....ప్రజలు ఆరోగ్య పరిరక్షణ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం త్వరలోనే ప్రతి ఒక్కరికీ ఈ-సంజీవిని కార్డులను అందజేస్తుందని తెలిపారు. ఈ కార్డుల ద్వారా రోగుల ఆరోగ్య వివరాలు ఆసుపత్రుల్లో డిజిటల్ రూపంలో అందుబాటులో ఉండి చికిత్స మరింత వేగవంతం అవుతుందని చెప్పారు. చిత్తూరులో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని, రానున్న సంవత్సరం నగర అభివృద్ధికి కీలకమని పేర్కొన్నారు. పలు ప్రధాన అభివృద్ధి పనులను పూర్తి చేయడంతో పాటు స్థానికంగా స్వర్ణ వార్డు సచివాలయం నిర్మాణానికి చర్యలు చేపడతామని వెల్లడించారు. ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ప్రజాప్రతినిధులను అభినందించారు.ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ పాలనలోనే రాష్ట్రంలో వేగవంతమైన అభివృద్ధి సాధ్యమవుతోందన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఈ-సంజీవిని వంటి ఆధునిక ఆరోగ్య కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు. నగర అభివృద్ధికి విశాలమైన రహదారులు, మెరుగైన మౌలిక వసతులు అత్యంత అవసరమని, అందుకే అనేక అవాంతరాలు ఎదురైనా రోడ్ల విస్తరణ పనులను ముందుకు తీసుకెళ్తున్నట్లు వివరించారు.త్వరలో ఎక్స్‌ప్రెస్ హైవేలు అందుబాటులోకి రావడం ద్వారా పరిశ్రమలు, పెట్టుబడులు చిత్తూరుకు ఆకర్షితమవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 2035 నాటికి చెన్నై–బెంగళూరు మహానగరాల మధ్య చిత్తూరు ప్రధాన ట్రాన్సిట్ హబ్‌గా ఎదుగుతుందని అన్నారు. ఈ లక్ష్య సాధనలో జిల్లా కలెక్టర్ సహకారం కీలకమని కొనియాడారు.అభివృద్ధి పనులపై కొందరు అవాస్తవ ప్రచారాలు చేస్తున్నప్పటికీ వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని, ప్రజల సంక్షేమం, నగరాభివృద్ధే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.అనంతరం నగరంలోని 5వ వార్డు కామేశ్వర్‌నగర్‌లో రూ.20 లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్డును, 8వ వార్డు మైత్రినగర్‌లో రూ.9.90 లక్షలతో నిర్మించిన మరో సిమెంట్ రోడ్డును ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ పనులు పూర్తికావడంతో ఆయా కాలనీల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కలగనుంది.ఈ కార్యక్రమంలో చుడా చైర్‌పర్సన్ కఠారి హేమలత, నగరపాలక సంస్థ కమిషనర్ పి. నరసింహ ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ బీఎన్ రాజసింహులు, మాజీ ఎమ్మెల్యే ఎఎస్ మనోహర్, పరిశీలకులు కుమారి, కూటమి నాయకులు అముద, సీకే లావణ్య, అట్లూరి శ్రీనివాసులు, వెంకటేష్ యాదవ్, కాజూరు బాలాజీ, ఈశ్వరరావు, రాము, క్లస్టర్, డివిజన్ ఇన్‌చార్జులు, స్థానిక నాయకులు, అధికారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.