అభివృద్ధితో పాటు ప్రజల ఆరోగ్యానికీ ప్రాధాన్యం: ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్

చిత్తూరులో రూ.88 లక్షల పట్టణ ఆరోగ్య కేంద్రం ప్రారంభం... రోడ్ల విస్తరణ, మౌలిక వసతులతో చిత్తూరు ట్రాన్సిట్ హబ్‌ గా ఎదుగుతుంది... చిత్తూరు,(జర్నలిస్ట్ జ్ఞాన ప్రకాష్):రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధితో పాటు ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ అన్నారు. చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలోని ప్రశాంత్‌నగర్‌ లో చంద్రబాబు నాయుడు కాలనీలో రూ.88 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వివిధ విభాగాలను ప్రారంభించడంతో పాటు ఆవరణలో మొక్క నాటి నీరు పోశారు.ఈ సందర్భంగా నిర్వహించిన...