Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఎల్లమ్మ జాతరకు గాజులమండ్యం ఎస్‌ఐకు ఆహ్వానం

    Author RAJANEETHI | 15 Jul 2026, 08:26 PM | ANDHRA PRADESH
    ఎల్లమ్మ జాతరకు గాజులమండ్యం ఎస్‌ఐకు ఆహ్వానం

    రేణిగుంట, జూలై 15 (రాజనీతి): రేణిగుంట పట్టణంలో ఈ నెల 21, 22 తేదీల్లో అత్యంత వైభవంగా నిర్వహించనున్న శ్రీ ఎల్లమ్మ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాలకు గాజులమండ్యం పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ హరీష ని ఆలయ ధర్మకర్తలు ఎలుమలై – నాగమణి దంపతులు బుదవారం మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐని కలిసి జాతరకు సంబంధించిన ప్రత్యేక ఆహ్వాన పత్రికను అందజేశారు. అనంతరం శాలువాతో ఘనంగా సత్కరించి, శ్రీ ఎల్లమ్మ అమ్మవారి తీర్థప్రసాదాలను సమర్పించి జాతర ఉత్సవాలకు విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు. జాతర సందర్భంగా రేణిగుంటతో పాటు పరిసర ప్రాంతాల నుంచి వేలాదిమంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణ, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన పోలీసు బందోబస్తు కల్పించాలని ధర్మకర్తలు విజ్ఞప్తి చేశారు. పోలీసు శాఖ సహకారంతో జాతరను ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించగలమనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అలాగే జాతర సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అమ్మవారికి విశేష అలంకరణ, సాంప్రదాయ ధార్మిక కార్యక్రమాలు, భక్తుల కోసం ప్రత్యేక దర్శన ఏర్పాట్లు, అన్నప్రసాద వితరణ, తాగునీరు, విద్యుత్ వెలుగులు, పారిశుద్ధ్య ఏర్పాట్లు తదితర అన్ని ఏర్పాట్లు చేపడుతున్నట్లు ఎలుమలై – నాగమణి దంపతులు తెలిపారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా భక్తిశ్రద్ధలతో, సంప్రదాయబద్ధంగా, అత్యంత వైభవంగా జాతర మహోత్సవాలను నిర్వహించేందుకు ఆలయ కమిటీ ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు. ఉత్సవాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ ఎల్లమ్మ అమ్మవారి కృపకు పాత్రులు కావాలని వారు ఆకాంక్షించారు.

    అత్యధికంగా చదివినవి