ఎల్లమ్మ జాతరకు గాజులమండ్యం ఎస్‌ఐకు ఆహ్వానం
రేణిగుంట, జూలై 15 (రాజనీతి): రేణిగుంట పట్టణంలో ఈ నెల 21, 22 తేదీల్లో అత్యంత వైభవంగా నిర్వహించనున్న శ్రీ ఎల్లమ్మ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాలకు గాజులమండ్యం పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ హరీష ని ఆలయ ధర్మకర్తలు ఎలుమలై – నాగమణి దంపతులు బుదవారం మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐని కలిసి జాతరకు సంబంధించిన ప్రత్యేక ఆహ్వాన పత్రికను అందజేశారు. అనంతరం శాలువాతో ఘనంగా సత్కరించి, శ్రీ ఎల్లమ్మ అమ్మవారి తీర్థప్రసాదాలను సమర్పించి జాతర ఉత్సవాలకు విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు. జాతర సందర్భంగా రేణిగుంటతో పాటు పరిసర ప్రాంతాల నుంచి వేలాదిమంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున శాంతిభద్రతల...