Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • చైన్ స్నాచింగ్‌ల అరికట్టేందుకు రాత్రి వేళ విస్తృత వాహన తనిఖీలు

    Author RAJANEETHI | 14 Jul 2026, 02:38 PM | చిత్తూరు
    చైన్ స్నాచింగ్‌ల అరికట్టేందుకు రాత్రి వేళ విస్తృత వాహన తనిఖీలు

    చిత్తూరు(జర్నలిస్ట్ జ్ఞాన ప్రకాష్):చిత్తూరు నగరంలో చైన్ స్నాచింగ్‌లు ఇతర నేరాలను అరికట్టేందుకు చిత్తూరు టూ టౌన్ పోలీసులు సోమవారం రాత్రి విస్తృత వాహన తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు, చిత్తూరు ఎస్‌డీపీవో పర్యవేక్షణలో టూ టౌన్ సీఐ నెట్టికంటయ్య ఆధ్వర్యంలో కాజూరు జంక్షన్ వద్ద ఈ ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. రక్షక్-2, భద్ర-4, 6, 7 బృందాలకు చెందిన సిబ్బంది పాల్గొని ద్విచక్ర నాలుగు చక్రాల వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించారు. తనిఖీల సందర్భంగా వాహనాల పత్రాలను పరిశీలించడంతో పాటు అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులను ప్రశ్నించి వారి వివరాలు నమోదు చేశారు. నేరాలకు పాల్పడే అవకాశం ఉన్న వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు పోలీసులు తెలిపారు. నగరంలో రాత్రి వేళ నేరాల నియంత్రణ ప్రజలకు భద్రత కల్పించడమే ఈ తనిఖీల ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ఇటీవల చైన్ స్నాచింగ్‌లు దొంగతనాలు వంటి ఘటనలను దృష్టిలో ఉంచుకుని రాత్రిపూట పోలీసు గస్తీని మరింత ముమ్మరం చేసినట్లు అధికారులు వెల్లడించారు. ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాలు, జాతీయ రహదారుల అనుసంధాన మార్గాల్లో కూడా ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు కనిపించినా ఏదైనా అనుమానాస్పద సంఘటన గమనించినా వెంటనే అత్యవసర సేవల 112కు సమాచారం అందించాలని టూ టౌన్ సీఐ నెట్టికంటయ్య కోరారు. ప్రజల సహకారంతోనే నేరాలను సమర్థవంతంగా అరికట్టడం సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. నగరంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు అన్ని విధాలుగా కట్టుబడి ఉన్నారని రాత్రి వేళ ప్రత్యేక తనిఖీలు గస్తీ కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు.

    అత్యధికంగా చదివినవి