చైన్ స్నాచింగ్‌ల అరికట్టేందుకు రాత్రి వేళ విస్తృత వాహన తనిఖీలు
చిత్తూరు(జర్నలిస్ట్ జ్ఞాన ప్రకాష్):చిత్తూరు నగరంలో చైన్ స్నాచింగ్‌లు ఇతర నేరాలను అరికట్టేందుకు చిత్తూరు టూ టౌన్ పోలీసులు సోమవారం రాత్రి విస్తృత వాహన తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు, చిత్తూరు ఎస్‌డీపీవో పర్యవేక్షణలో టూ టౌన్ సీఐ నెట్టికంటయ్య ఆధ్వర్యంలో కాజూరు జంక్షన్ వద్ద ఈ ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. రక్షక్-2, భద్ర-4, 6, 7 బృందాలకు చెందిన సిబ్బంది పాల్గొని ద్విచక్ర నాలుగు చక్రాల వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించారు. తనిఖీల సందర్భంగా వాహనాల పత్రాలను పరిశీలించడంతో పాటు అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులను ప్రశ్నించి వారి వివరాలు నమోదు చేశారు. నేరాలకు పాల్పడే అవకాశం ఉన్న వ్యక్తుల కదలికలపై ప్రత్యేక...