Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • టిడ్కో రద్దు లబ్ధిదారులకు రూ.3.71 కోట్ల వాటా సొమ్ము పంపిణీ...

    Author RAJANEETHI | 11 Jul 2026, 05:46 PM | ANDHRA PRADESH
    టిడ్కో రద్దు లబ్ధిదారులకు రూ.3.71 కోట్ల వాటా సొమ్ము పంపిణీ...

    672 మందికి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్....


    చిత్తూరు(జర్నలిస్ట్ జ్ఞాన ప్రకాష్): గతంలో టిడ్కో గృహాల కోసం లబ్ధిదారులు చెల్లించిన వాటా సొమ్ములను, గృహాల కేటాయింపులు రద్దు అయిన వారికి ఎనిమిదేళ్ల అనంతరం తిరిగి చెల్లించడం కూటమి ప్రభుత్వ ప్రజాహిత నిబద్ధతకు నిదర్శనమని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు. చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో టిడ్కో గృహాల కేటాయింపులు రద్దైన 672 మంది లబ్ధిదారులకు రూ.3.71 కోట్ల విలువైన చెక్కులను ఆయన పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో లబ్ధిదారులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి పై విశ్వాసంతో తమ వాటా సొమ్ములను చెల్లించారని, అనంతరం వచ్చిన ప్రభుత్వం టిడ్కో గృహాల నిర్మాణాన్ని పూర్తిచేయకపోవడమే కాకుండా అనేక మంది లబ్ధిదారుల ఇళ్ల కేటాయింపులను రద్దు చేసి, వారు చెల్లించిన సొమ్మును కూడా తిరిగి ఇవ్వలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా, ప్రజల ఇబ్బందులను అర్థం చేసుకున్న ఆయన సానుకూల నిర్ణయం తీసుకుని లబ్ధిదారులకు వారి వాటా సొమ్మును తిరిగి చెల్లించేలా చర్యలు చేపట్టారని తెలిపారు.
    చిత్తూరు నగరంలో అర్హులైన ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఇందుకోసం నగర పరిధిలో అనువైన స్థలాన్ని గుర్తించి కొత్త గృహ నిర్మాణాలకు త్వరలోనే శ్రీకారం చుడతామని చెప్పారు. కేంద్రంలోని కూటమి ప్రభుత్వం సహకారంతో రాష్ట్రంలో, ముఖ్యంగా చిత్తూరు నియోజకవర్గంలో గృహరహితులైన అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేయించేందుకు కృషి చేస్తామని వెల్లడించారు.లబ్ధిదారులు కూడా తమ సొమ్ము తిరిగి అందడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో చుడా చైర్‌పర్సన్ కఠారి హేమలత, చిత్తూరు నగరపాలక సంస్థ కమిషనర్ పి. నరసింహ ప్రసాద్, మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ త్యాగరాజన్, కూటమి నాయకులు అముద, రాజేష్‌రెడ్డి, వెంకటేష్ యాదవ్, అట్లూరి శ్రీనివాసులు, టిడ్కో అధికారులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

    అత్యధికంగా చదివినవి