టిడ్కో రద్దు లబ్ధిదారులకు రూ.3.71 కోట్ల వాటా సొమ్ము పంపిణీ...

672 మందికి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్.... చిత్తూరు(జర్నలిస్ట్ జ్ఞాన ప్రకాష్): గతంలో టిడ్కో గృహాల కోసం లబ్ధిదారులు చెల్లించిన వాటా సొమ్ములను, గృహాల కేటాయింపులు రద్దు అయిన వారికి ఎనిమిదేళ్ల అనంతరం తిరిగి చెల్లించడం కూటమి ప్రభుత్వ ప్రజాహిత నిబద్ధతకు నిదర్శనమని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు. చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో టిడ్కో గృహాల కేటాయింపులు రద్దైన 672 మంది లబ్ధిదారులకు రూ.3.71 కోట్ల విలువైన చెక్కులను ఆయన పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో లబ్ధిదారులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి పై విశ్వాసంతో తమ వాటా సొమ్ములను చెల్లించారని,...