Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • కుటుంబ ఆరోగ్యమే దేశ సౌభాగ్యం. డి. ఎమ్. హెచ్. ఓ. డాక్టర్ లక్ష్మీ నరసయ్య

    కుటుంబ ఆరోగ్యమే దేశ సౌభాగ్యం. డి. ఎమ్. హెచ్. ఓ. డాక్టర్ లక్ష్మీ నరసయ్య

    తేది: 11.7-2026 మదనపల్లి.కుటుంబ ఆరోగ్యమే దేశ సౌభాగ్య మని అన్నమయ్య జిల్లా వైద్య ఆరోగ్య శాకాధికారి డాక్టర్ లక్ష్మీ నరసయ్య అన్నారు. శనివారం “ప్రపంచ జనాభా దినోత్సవం” సందర్భముగా జిల్లా కేంద్రం మదనపల్లి లోని జిల్లా ఆస్పత్రి నుండి ర్యాలీని డి. ఎమ్. హెచ్. ఓ. డాక్టర్ లక్ష్మీ నరసయ్య జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా డి. ఎమ్. హెచ్. ఓ. మాట్లాడుచు ప్రతి సంవత్సరం జూన్ 11 వ తేదీన “ప్రపంచ జనాభా దినోత్సవం” జరుపుకొంటున్నామని అందులోభాగంగా ఈ సంవత్సరం జులై 11వ తేదీ నుండి 18వ తేదీ వరకు జనాభా దినోత్సవ వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది అన్నారు. "పిల్లల మధ్య వ్యవధి పాటిద్దాం -ఆరోగ్యవంతమైన, .సంతోషకరమైన కుటుంబాన్ని నిర్మిద్దాం."అను నినాదంతో అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. తల్లి కావడానికి సరియైన వయస్సు స్త్రీ వయస్సు 18సంవత్సరములు, పురుషుని వయస్సు 21 సంవత్సరములుగా బాల్య వివాహ నిషేధ చట్టాన్ని పాటిస్తూ అమలు చేస్తున్నట్లు తెలిపారు. తల్లి కావడానికి సరియైన వయస్సు శారీరకంగా మరియు మానసికంగా ఆరోగ్యాంగా ఉన్నప్పుడు మాత్రమే గర్భధారణ కు అనుకూలమని తెలిపారు.తల్లీ మరియు బిడ్డ శ్రేయస్సు కోసం సరైన సమయంలో గర్బదారణ మరియు బిడ్డకు బిడ్డకు మద్య అంతరం” అను నినాదంతో అవగాహన కార్యక్రమాలు అంతటా నిర్వహించాలని మరియు అనుబంధ శాఖల సహకారం తో అవగాహనా, చైతన్య కార్యక్రమాలు ఈ వారం రోజులపాటు విరివిగా చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు.టి. ఎఫ్. ఆర్ రేటు ను పెంచే విదంగా అర్హులైన దంపతులకు కౌన్సిలింగ్ ఇవ్వాలని , దంపతులు మేమిద్దరం మాకు ముగ్గురు అనే విదంగా వారిలో జనాభా సమత్తూల్యత,స్థిరేకరణ పైన అవగాహన కల్పించాలని అన్నారు. డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ మాట్లాడుచు బాస్కెట్ అప్రోచ్ ద్వారా అర్హులైన దంపతులకు పిల్లల మధ్య వ్యవధి పాటించడానికి తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతులపై అవగాహనా సదస్సులు నిర్వహించడం ద్వారా వారికి వారే వారికి నచ్చిన కుటుంబ నియంత్రణ పద్ధతిని ఎంచుకునే విదంగా చేయాలని అన్నారు. అనంతరం డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ నినాదాలు చేయిస్తూ, ప్లకార్డ్స్ ప్రదర్శన చేస్తూ జిల్లా ఆస్పత్రి నుండి అనిబిసెంట్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమం లో డి. ఎమ్. హెచ్ ఓ డాక్టర్ లక్ష్మీనరసయ్య, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మనసుర్ అహమ్మద్,104నోడల్ అధికారి డాక్టర్ శ్రీధర్, యు. పి. హెచ్. సి. వైద్యులు,డాక్టర్ ఫరఖాన్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి ,ఎస్. ఓ. ఓబుల్ రెడ్డి,డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ మహమ్మద్ రఫీ, రాజగోపాల్,నర్సింగ్ సూపరింటెండెంట్ మంజుల,ఎస్. టి. ఎస్. ప్రభాకర్, హెల్త్ అసిస్టెంట్ గంగయ్య తదితరులు పాల్గొన్నారు.

    అత్యధికంగా చదివినవి