Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఎలాంటి ఆపద వచ్చినా పార్టీ అండగా నిలుస్తాం : ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్

    Author RAJANEETHI | 10 Jul 2026, 11:32 PM | చిత్తూరు
    ఎలాంటి ఆపద వచ్చినా పార్టీ అండగా నిలుస్తాం : ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్

    చిత్తూరు(జర్నలిస్ట్ జ్ఞాన ప్రకాష్):తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు, వారి కుటుంబాలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ అన్నారు. చిత్తూరు నగరంలోని వళ్లియ్యప్పనగర్‌కు చెందిన టీడీపీ కార్యకర్త కె. వంశీ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, పార్టీ సభ్యత్వ నమోదుతో కల్పించిన ప్రమాద బీమా పథకం కింద రూ.5 లక్షల బీమా మంజూరైంది.
    బీమా మొత్తాన్ని నామినీ దివ్య బ్యాంకు ఖాతాలో జమ చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ పంపిన పరామర్శ లేఖతో పాటు బీమా మంజూరు పత్రాన్ని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ శుక్రవారం స్థానిక నాయకులతో కలిసి బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... పార్టీ కోసం అంకితభావంతో పనిచేసే ప్రతి కార్యకర్త సంక్షేమమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని, కార్యకర్తలకు ఎలాంటి ఆపద వచ్చినా పార్టీ అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. పార్టీ సభ్యత్వంతో కల్పిస్తున్న బీమా వంటి సంక్షేమ పథకాలు కార్యకర్తల కుటుంబాలకు భరోసాగా నిలుస్తాయని చెప్పారు. బాధిత కుటుంబానికి పార్టీ తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

    అత్యధికంగా చదివినవి