ఎలాంటి ఆపద వచ్చినా పార్టీ అండగా నిలుస్తాం : ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్
చిత్తూరు(జర్నలిస్ట్ జ్ఞాన ప్రకాష్):తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు, వారి కుటుంబాలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ అన్నారు. చిత్తూరు నగరంలోని వళ్లియ్యప్పనగర్‌కు చెందిన టీడీపీ కార్యకర్త కె. వంశీ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, పార్టీ సభ్యత్వ నమోదుతో కల్పించిన ప్రమాద బీమా పథకం కింద రూ.5 లక్షల బీమా మంజూరైంది. బీమా మొత్తాన్ని నామినీ దివ్య బ్యాంకు ఖాతాలో జమ చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ పంపిన పరామర్శ లేఖతో పాటు బీమా మంజూరు పత్రాన్ని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్...