Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • పల్లవోలు గ్రామంలో ‘ఫ్రైడే డ్రై డే’ నిర్వహణ.. ఆరోగ్య పరిరక్షణపై ప్రజలకు అవగాహన

    పల్లవోలు గ్రామంలో ‘ఫ్రైడే డ్రై డే’ నిర్వహణ.. ఆరోగ్య పరిరక్షణపై ప్రజలకు అవగాహన

    మేడికుర్తి, జూలై 10: మేడికుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) ఆధ్వర్యంలో పరిధిలోని పల్లవోలు గ్రామంలో శుక్రవారం ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణ, పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్యకరమైన జీవన విధానంపై అవగాహన కల్పించారు.

    అదేవిధంగా టీబీఎంబీఏ (TBMBA) కార్యక్రమంలో భాగంగా క్షయవ్యాధి లక్షణాలు, ముందస్తు నిర్ధారణ, ఉచిత చికిత్స సేవలపై ప్రజలకు వివరించారు. అలాగే ఇంటెన్సిఫైడ్ డయేరియా కంట్రోల్ ఫోర్ట్‌నైట్ (IDCF) కార్యక్రమం కింద వర్షాకాలంలో విరేచన వ్యాధులను నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిశుభ్రమైన తాగునీటి వినియోగం, ఓఆర్‌ఎస్ ద్రావణం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.

    ఈ కార్యక్రమంలో సబ్ యూనిట్ ఆఫీసర్ ముజీబ్ బాషా, సూపర్‌వైజర్, ఎంఎల్‌హెచ్‌పీ, ఎంపీహెచ్‌ఏ (పురుషులు), ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొని గ్రామ ప్రజలకు ఆరోగ్య సూచనలు అందించారు.

    ఇవి కూడా చదవండి

    ప్రజలు ప్రతి శుక్రవారం 'డ్రై డే' పాటిస్తూ ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, దోమల నివారణ చర్యలను తప్పనిసరిగా అమలు చేయాలని ఆరోగ్య శాఖ అధికారులు సూచించారు. అలాగే క్షయవ్యాధి, విరేచన వ్యాధులపై అప్రమత్తంగా ఉండి, ఏవైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలని కోరారు.

    అత్యధికంగా చదివినవి