Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • దోమల నియంత్రణకు పటిష్ట చర్యలు....

    Author RAJANEETHI | 10 Jul 2026, 11:01 AM | ANDHRA PRADESH
    దోమల నియంత్రణకు పటిష్ట చర్యలు....

    డ్రోన్ ద్వారా బీటీ ముందు పిచికారి...

    కమిషనర్ పి.నరసింహ ప్రసాద్ ....


    చిత్తూరు(జులై 10),(జ్ఞాన ప్రకాష్ జర్నలిస్ట్):చిత్తూరు నగరంలో దోమల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్ పి.నరసింహ ప్రసాద్ చెప్పారు. ఫ్రైడే డ్రైడే, డెంగీ నివారణ మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం నగరపాలక పరిధిలోని దుర్గా నగర్ కాలనీలోని మురికి నీటిపై డ్రోన్ ద్వారా దోమల లార్వాలను నాశనం చేయడం కోసం బీటీ మందును పిచికారి చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డెంగీ నివారణ చర్యలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.కార్యక్రమంలో కమిషనర్ మాట్లాడుతూ.. దోమల నియంత్రణ చర్యలకు ప్రజలు సహకరించాలని కోరారు. ప్రధానంగా గృహ పరిసరాల్లో నిలువ నీరు లేకుండా చూడాలన్నారు. నగరపాలక పరిధిలో నిల్వ నీటి కుంటలు, మురుగునీటి నిల్వ ప్రాంతాలు, మనుషులు వెళ్ళలేని ప్రాంతాల్లో డ్రోన్ ద్వారా దోమల లార్వాలను నాశనం చేయడం కోసం బీటీ మందు పిచికారి చేయిస్తున్నట్లు చెప్పారు. రానున్న వర్షాకాలం నేపథ్యంలో నగరంలోని అన్ని వార్డుల్లో కాలువల్లో పూడికతీత పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు.
    ఎంహెచ్వో డా. లోకేష్ మాట్లాడుతూ.. నగరంలో శుక్రవారం దుర్గా నగర్ కాలనీ, బాలాజీ నగర్, ధర్మరాజుల కాలనీ, ఓబనపల్లి గంగమ్మకుంట ప్రాంతాల్లో డ్రోన్ ద్వారా బీటీ మందును పిచికారి చేయించామన్నారు. కార్యక్రమంలో ప్రజారోగ్య విభాగం అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

    ఇవి కూడా చదవండి

    అత్యధికంగా చదివినవి