దోమల నియంత్రణకు పటిష్ట చర్యలు....
డ్రోన్ ద్వారా బీటీ ముందు పిచికారి... కమిషనర్ పి.నరసింహ ప్రసాద్ .... చిత్తూరు(జులై 10),(జ్ఞాన ప్రకాష్ జర్నలిస్ట్):చిత్తూరు నగరంలో దోమల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్ పి.నరసింహ ప్రసాద్ చెప్పారు. ఫ్రైడే డ్రైడే, డెంగీ నివారణ మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం నగరపాలక పరిధిలోని దుర్గా నగర్ కాలనీలోని మురికి నీటిపై డ్రోన్ ద్వారా దోమల లార్వాలను నాశనం చేయడం కోసం బీటీ మందును పిచికారి చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డెంగీ నివారణ చర్యలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.కార్యక్రమంలో కమిషనర్ మాట్లాడుతూ.. దోమల నియంత్రణ చర్యలకు ప్రజలు సహకరించాలని కోరారు. ప్రధానంగా గృహ పరిసరాల్లో నిలువ నీరు లేకుండా చూడాలన్నారు. నగరపాలక పరిధిలో...