Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • రైల్వేకోడూరులో సమరసత సేవా పౌండేషన్ మండల కన్వీనర్ల అభ్యాస వర్గ కార్యక్రమం

    Author RAJANEETHI | 08 Jul 2026, 08:19 PM | ANDHRA PRADESH, ఆంధ్రప్రదేశ్
    రైల్వేకోడూరులో సమరసత సేవా పౌండేషన్ మండల కన్వీనర్ల అభ్యాస వర్గ కార్యక్రమం

    👉తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలలో మండల కన్వీనర్లతో సమావేశం ఏర్పాటు.

    👉ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్సీ బత్యాల, శ్రీశైలం బోర్డు చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు, ఎస్.ఎస్.ఎఫ్ ప్రాంత అధికారి కొండారెడ్డి గార్లు

    ఈరోజు 08-07-2026వ తేది బుధవారం నాడు రైల్వేకోడూరు లోని ఆర్యవైశ్య కళ్యాణమండపం నందు సమరసత సేవా ఫౌండేషన్ (ssf) తిరుపతి విభాగం మూడు జిల్లాలు అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల మండల కన్వీనర్లు, సహా కన్వీనర్ల శిక్షణా తరగతులు కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

    ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్సీ గౌరవ,,శ్రీ బత్యాల చంగల్ రాయుడు గారు, శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు మరియు ఎస్.ఎస్.ఎఫ్ ప్రాంత అధికారి కొండారెడ్డి గారు మాట్లాడుతూ ప్రతి మనిషిలో సేవాభావాన్ని పెంపొందిస్తూ, సమాజంలో ఐక్యత, సోదరభావం, పరస్పర గౌరవాన్ని బలోపేతం చేయాలనే లక్ష్యంతో సమరసత సేవా ఫౌండేషన్ తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తోందన్నారు.

    ఇవి కూడా చదవండి

    సమాజంలో సమరసతకు ప్రోత్సాహం, విద్య, సంస్కారం, విలువలతో బాల వికాస్ కార్యక్రమాలు, ఆలయాల నిర్మాణం, పునరుద్ధరణకు సహకారం, సేవా దృక్పథంతో బలహీన వర్గాల సాధికారతకు కృషి మనందరం కలిసుంటేనే సమాజం బలపడుతుంది... సేవ చేస్తేనే జీవితం సార్థకమవుతుందని తెలిపారు.

    అలాగే రైల్వేకోడూరు నియోజకవర్గంలో బత్యాల గారు ఇప్పటివరకు 83 దేవాలయాలను తన సొంత నిధులతో నిర్మించారని దానివల్ల ఆ గ్రామాల్లో ఉన్న క్రిస్టియన్స్ కూడా రాములవారిని కొలుస్తామని మాటిచ్చారని తెలిపారు.

    ఇంకా రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లో సొంత నిధులతో పలు గ్రామాలకి మరియు స్మశానాలకు మెటల్ రోడ్స్ వేయించడం, బోర్లు వేసి త్రాగునీటి సమస్యలు తీర్చడం వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి ఆయన వంతు అహర్నిశలు కృషి చేస్తుంటారు.

    రండి.., తరలిరండి సమరసతతో కూడిన సమాజ నిర్మాణంలో మన వంతు పాత్ర పోషిద్దాం అని అన్నారు. సమాజంలో జరుగుతున్న మతమార్పిడులను జరగకుండా చూడడం మారిన వారిని తిరిగి హిందుత్వంలోకి తీసుకురావడం లక్ష్యంగా పనిచేయాలని భారతదేశాన్ని తిరిగి విశ్వ గురువుగా చూడాలని మన హైందవ సంస్కృతి సంప్రదాయాలను చాటి చెప్పాలని వారు తెలియజేశారు.........., ఈ కార్యక్రమంలో రాయలసీమ జోనల్ ఇంచార్జ్ వెంగల్రెడ్డి శ్రీనివాసులు అన్ని మండలాల మండల కన్వీనర్లు సహా కన్వీనర్లు పాల్గొన్నారు.

    అత్యధికంగా చదివినవి