Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • బాలికల భద్రత, చిన్నారుల విద్య, సైబర్ నేరాల నివారణ, రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన.

    బాలికల భద్రత, చిన్నారుల విద్య, సైబర్ నేరాల నివారణ, రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన.

    తిరుపతి జిల్లా పోలీస్ శాఖ.
    తేదీ: 08-07-2026.

    - ప్రజల్లో చట్టాల పట్ల అవగాహన పెంపొందించేందుకు జిల్లా వ్యాప్తంగా పోలీసుల విస్తృత ప్రచార కార్యక్రమాలు.

    - బాలికల భద్రత, చిన్నారుల విద్య, సైబర్ నేరాల నివారణ, రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన.

    - గంజాయి, మాదక ద్రవ్యాలు, అక్రమ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ప్రజలకు పిలుపు.

    - సురక్షిత, నేరరహిత సమాజ నిర్మాణంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని జిల్లా పోలీసుల విజ్ఞప్తి.

    తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు, జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ సబ్ డివిజన్లు, సర్కిళ్లు, పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీస్ అధికారులు ప్రజలు, యువత, విద్యార్థులు, మహిళలు మరియు గ్రామస్థులకు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

    ఇవి కూడా చదవండి

    ఈ కార్యక్రమాల్లో బాలికల భద్రత, మహిళల రక్షణ, చిన్నారుల హక్కులు, విద్య యొక్క ప్రాముఖ్యత, బాల్య వివాహాల నివారణ, ఉన్నత విద్య ద్వారా మెరుగైన భవిష్యత్తు, ప్రభుత్వ ఉద్యోగాల్లో అమలులో ఉన్న రిజర్వేషన్లపై విద్యార్థులకు సమగ్రంగా అవగాహన కల్పించారు. ప్రతి విద్యార్థి విద్యను ఆయుధంగా భావించి లక్ష్యసాధన దిశగా కృషి చేయాలని సూచించారు.

    అదేవిధంగా, సైబర్ నేరాల నివారణపై ప్రజలకు సూచనలు చేస్తూ అపరిచిత ఫోన్ కాల్స్, నకిలీ లింకులు, ఓటీపీలు, బ్యాంకు ఖాతా వివరాలు, వ్యక్తిగత సమాచారం ఎవరికీ ఇవ్వకూడదని హెచ్చరించారు. సైబర్ మోసాలకు గురైన వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు సమాచారం ఇవ్వాలని, అధికారిక సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని వివరించారు.

    రోడ్డు భద్రతపై మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా నాణ్యమైన హెల్మెట్ ధరించాలని, చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్‌తోనే వాహనాలు నడపాలని, ట్రాఫిక్ నిబంధనలను పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. మద్యం సేవించి వాహనం నడపడం, అతివేగంగా ప్రయాణించడం, మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ డ్రైవింగ్ చేయడం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు.

    గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలు మరియు అక్రమ కార్యకలాపాల వల్ల వ్యక్తి, కుటుంబం, సమాజంపై పడే తీవ్ర ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. మాదక ద్రవ్యాల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని, అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

    ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., సందేశం ఇస్తూ నేరాల నివారణలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకం. అవగాహనతో కూడిన సమాజమే సురక్షిత సమాజానికి పునాది. మహిళలు, చిన్నారుల భద్రత, మాదక ద్రవ్యాల నిర్మూలన, సైబర్ నేరాల నివారణ, రోడ్డు భద్రత వంటి అంశాల్లో ప్రతి పౌరుడు బాధ్యతతో వ్యవహరించి పోలీస్ శాఖకు సహకరించాలి. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు తిరుపతి జిల్లా పోలీసులు నిరంతరం కట్టుబడి ఉంటారు. అని తెలిపారు.

    అత్యవసర పరిస్థితుల్లో వెంటనే 112కు సమాచారం అందించాలని, మహిళల సహాయం కోసం 181 హెల్ప్‌లైన్‌ను, సైబర్ మోసాలకు సంబంధించిన ఫిర్యాదుల కోసం 1930 హెల్ప్‌లైన్‌ను వినియోగించాలని జిల్లా పోలీసులు ప్రజలకు సూచించారు.

    అత్యధికంగా చదివినవి