Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • టి. బి. ముక్త్ భారత్ అభియాన్ మరియు డెంగీ మాసోత్చవాలు విజయంతం చేద్దాం.డిప్యూటీ హెచ్. ఈ. ఓ మహమ్మద్ రఫీ.

    టి. బి. ముక్త్ భారత్ అభియాన్  మరియు డెంగీ మాసోత్చవాలు విజయంతం చేద్దాం.డిప్యూటీ హెచ్. ఈ. ఓ మహమ్మద్ రఫీ.

    8/7/26 సోమల
    టి. బి. ముక్త్ భారత్ అభియాన్ మరియు డెంగ్యూ మాసోత్చవాలు, స్టాప్ డయేరియా లను విజయవంతం చేద్దామని డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖధికారి వారి ఆదేశాల మేరకు డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ సోమల పి. హెచ్. సి. వైద్యులు డాక్టర్ రాజకుమార్ ఆధ్వర్యంలో సదుం మండల కేంద్రంలోని జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ నరేంద్ర కుమార్ మరియు ఎన్. ఎస్. ఎస్. కోర్డినేటర్ గౌతమ్ అధ్యక్షతన విద్యార్థులుకు ఆరోగ్య కార్యక్రమాల అవగాహన కార్యక్రమం లో భాగంగా డెంగ్యూ, టి. బి వ్యాధులపై అవగాహన కల్పించి ర్యాలీ, ప్రతిజ్ఞ నిర్వహించడం మరియు కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ మాట్లాడుచు టి. బి.ముక్త్ భారత్ అభియాన్ 100రోజుల కార్యక్రమం లో భాగంగా ఆశా కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహించి పొగత్రాగు వారిని, మద్యం సేవించు వారిని, గతం లో టి. బి. జబ్బు వచ్చి భాగైన వారిని, హెచ్. ఐ. వి. పాజిటివ్ వారిని, బి. ఎమ్. ఐ 18 కంటే తక్కువ ఉన్న వారిని, గర్భవతులను, షుగర్ ఉన్న వారిని, దీర్ఘాకాలిక జబ్బులు ఉన్న వారిని గుర్తించి వారికి గళ్ళ పరీక్షలు నిర్వహించి, వారికి పాజిటివ్ వచ్చిన యెడల ఆరు నెలల చికిత్స ఉచితంగా ప్రారంభించడం జరుగుతుంది అన్నారు. చికిత్స సమయం లో రోగి ఖాతా లో రు 1000/-జమ చేయడం జరుగుతుంది అన్నారు. మంచి పౌష్టికాహారం తీసుకోవడం కోసం ఈ పైకం వారికి ఇవ్వడం జరుగుతుంది అన్నారు.తిన్నావా. బి. రోగులకు పౌష్టికాహారం అందించుటకు అనగా వారిని దత్తత తీసుకోవడానికి పోషన్ మిత్రలు ముందుకు రావాలాన్నారు. మరియు జులై నెల ను డెంగ్యూ వ్యతిరేక మాసూత్చావం నిర్వహించడం జరుగుతుంది అన్నారు. ప్రజల లో ఈ నెల రోజులు దోమ కాటు ద్వారా వ్యాప్తి చెందే డెంగ్యూ జబ్బు పై మరియు ఫ్రైడే డ్రై డే పై అవగాహన కల్పిస్తారణి అన్నారు. అనంతరం నినాదాలు చేస్తూ, ప్లాకార్డ్స్ ప్రదర్శన చేస్తూ ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు. ఫ్రైడేని డ్రైడే గా పాటించాలని, రోజూ సాయంత్రం వేళ ఇంట్లో పచ్చి వేపాకు పొగ వేసుకోవాలని, కిటికీలకు మెష్ వేయించాలని, ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, కాలవలలో చెత్త వేయరాదని పిలుపునిచ్చారు .క్రమం తప్పకుండ యోగ చేయడం వల్ల ఒత్తిడి తగ్గి, బాడీ ఫిట్నెస్ ఉంటుంది అన్నారు. ఈ కార్యక్రమం లో వైద్యులు డాక్టర్ రాజకుమార్, ప్రిన్సిపాల్ నరేంద్ర కుమార్, ఎన్. ఎస్. ఎస్. కోఆర్డినేటర్ గౌతమ్ పర్యవేక్షకులు వసంత్ అధ్యాపక బృందం, హెల్త్ అసిస్టెంట్ సుధాకర్ ఆశాకార్యకర్తలు వరలక్ష్మి, లక్ష్మీదేవి పాల్గొన్నారు.

    అత్యధికంగా చదివినవి