Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • క్షేత్రస్థాయిలో పరిశీలన: అంగన్‌వాడీల్లో నాణ్యతకు కలెక్టర్ ఆదేశాలు

    Author RAJANEETHI | 08 Jul 2026, 06:36 PM | ANDHRA PRADESH, ఆంధ్రప్రదేశ్
    క్షేత్రస్థాయిలో పరిశీలన: అంగన్‌వాడీల్లో నాణ్యతకు కలెక్టర్ ఆదేశాలు

    అన్నమయ్య జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు అందిస్తున్న సేవలు, పోషకాహారం, భవనాల నిర్వహణ, మరమ్మతు పనుల పురోగతిని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పిల్లలకు నాణ్యమైన సేవలు అందించడంతో పాటు అన్ని కేంద్రాల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

    అనంతరం, ఇరికిపెంట గ్రామ పంచాయతీ పరిధిలోని ఒడ్డిపల్లి అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి, జిల్లా పరిషత్ 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన మరమ్మతు పనులను పరిశీలించారు. మండలంలో మంజూరైన మొత్తం ఎనిమిది పనుల్లో ఆరు పనులు ఇప్పటికే పూర్తయ్యాయని, ఒక పని రెండు రోజుల్లో, మరొకటి ఇరవై రోజుల్లో పూర్తవుతాయని ఇంజనీరింగ్ అధికారులు వివరించారు. మిగిలిన పనులను నాణ్యతతో, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్

    క్షేత్రస్థాయిలో పరిశీలన: అంగన్‌వాడీల్లో నాణ్యతకు కలెక్టర్ ఆదేశాలు - Additional Image

    814520b2-7664-41d2-a486-0da002ff16f1
    ఆదేశించారు.

    ఇవి కూడా చదవండి

    అంగన్‌వాడీ కార్యకర్తతో మాట్లాడి, ఆరు నెలల నుంచి మూడు సంవత్సరాల వయస్సు గల చిన్నారులకు అందిస్తున్న టేక్ హోమ్ రేషన్ (THR) పంపిణీపై కలెక్టర్ ఆరా తీశారు. 95 శాతం పంపిణీ పూర్తైందని, మిగిలిన పంపిణీ కూడా ఈ రోజు పూర్తి చేస్తామని కార్యకర్త తెలియజేశారు. గుడ్ల పంపిణీ ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం క్రమం తప్పకుండా జరుగుతోందని వివరించారు. చిన్నారులకు అందించే పోషకాహారం నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, అర్హులైన ప్రతి లబ్ధిదారునికి సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.

    తదనంతరం, వల్లిగట్ల గ్రామ పంచాయతీ పరిధిలోని కొత్తపల్లి అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి, కేంద్రంలో నమోదైన చిన్నారుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేంద్రంలో ఏడుగురు చిన్నారులు ఉన్నట్లు అంగన్‌వాడీ కార్యకర్త వివరించారు. కొత్తపల్లి అంగన్‌వాడీ భవనాన్ని త్వరితగతిన పూర్తి

    8be90d7d-a52f-4aba-a611-25f8c827847b
    చేసి వినియోగంలోకి తీసుకురావాలని కలెక్టర్ ఆదేశించారు. చిన్నారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మరుగుదొడ్లు, సురక్షిత తాగునీటి సౌకర్యం, ఇతర మౌలిక వసతులను వెంటనే ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ పనుల్లో సహాయ ఇంజనీర్‌తో సమన్వయం చేసుకుని వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.

    అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు పరిశుభ్రమైన, సురక్షితమైన వాతావరణంలో సేవలు అందించాలని, భవనాల నిర్వహణ, పోషకాహార పంపిణీ, హాజరు నమోదు, పరిశుభ్రత వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి చిన్నారికి మెరుగైన సేవలు అందేలా అధికారులు, అంగన్‌వాడీ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ రాజేశ్వరి, సూపర్వైజర్ హరిత, ఐసీడీఎస్, ఇంజినీరింగ్ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.