క్షేత్రస్థాయిలో పరిశీలన: అంగన్వాడీల్లో నాణ్యతకు కలెక్టర్ ఆదేశాలు
అన్నమయ్య జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు అందిస్తున్న సేవలు, పోషకాహారం, భవనాల నిర్వహణ, మరమ్మతు పనుల పురోగతిని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పిల్లలకు నాణ్యమైన సేవలు అందించడంతో పాటు అన్ని కేంద్రాల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం, ఇరికిపెంట గ్రామ పంచాయతీ పరిధిలోని ఒడ్డిపల్లి అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి, జిల్లా పరిషత్ 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన మరమ్మతు పనులను పరిశీలించారు. మండలంలో మంజూరైన మొత్తం ఎనిమిది పనుల్లో ఆరు పనులు ఇప్పటికే పూర్తయ్యాయని, ఒక పని రెండు రోజుల్లో, మరొకటి ఇరవై రోజుల్లో పూర్తవుతాయని ఇంజనీరింగ్ అధికారులు...