Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు

    Author RAJANEETHI | 08 Jul 2026, 10:26 AM | ANDHRA PRADESH
    ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు

    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను రేణిగుంట పట్టణంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి తనయురాలు పవిత్ర రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వైఎస్‌ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి "జయహో వైఎస్ఆర్" నినాదాలతో ఆయన సేవలను స్మరించుకున్నారు. మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతను చాటారు. ఈ సందర్భంగా పవిత్ర రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి జీవితాన్ని అంకితం చేసిన మహానేత అని కొనియాడారు. ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు సిద్ధగుంట సుధాకర్ రెడ్డి, అత్తూరు హరి ప్రసాద్ రెడ్డి, పేరూరి పురుషోత్తం రెడ్డి, ప్రభాకర్, మాజీ సర్పంచ్ నగేశం, దయాకర్ రెడ్డి, ముస్లిం మైనార్టీ నాయకులు మహమ్మద్ షబ్బీర్, ఖదీర్, ఇరానీ ఖాదర్, రఫీ ఉల్లా, మునిశేఖర్ రెడ్డి, బెనర్జీ, జడ్పిటిసి సంధ్య, తహసీన, సరోజమ్మ, తదితర కర్యకర్తలు, నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.

    ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు - Additional Image
    అత్యధికంగా చదివినవి