ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను రేణిగుంట పట్టణంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి తనయురాలు పవిత్ర రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వైఎస్‌ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి "జయహో వైఎస్ఆర్" నినాదాలతో ఆయన సేవలను స్మరించుకున్నారు. మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతను చాటారు. ఈ సందర్భంగా పవిత్ర రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి జీవితాన్ని అంకితం చేసిన మహానేత అని కొనియాడారు. ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని...