Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • *పుట్టా కృష్ణారెడ్డి వర్ధంతి | పేదలకు అన్నదానం* *తండ్రి జ్ఞాపకాలను సేవతో నిలుపుకున్న రాజశేఖర్ రెడ్డి.*

    Author RAJANEETHI | 07 Jul 2026, 02:44 PM | ANDHRA PRADESH, ఆంధ్రప్రదేశ్
    *పుట్టా కృష్ణారెడ్డి వర్ధంతి | పేదలకు అన్నదానం*  *తండ్రి జ్ఞాపకాలను సేవతో నిలుపుకున్న రాజశేఖర్ రెడ్డి.*

    పేదల ఆకలి తీర్చడమే నిజమైన నివాళి అంటూ పుట్టా కృష్ణారెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు పుట్టా రాజశేఖర్ రెడ్డి అన్న క్యాంటీన్ లో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు

    పీలేరు మండలం కాకులారం పల్లికి చెందిన పుట్టా కృష్ణారెడ్డి వర్ధంతి సందర్భంగా పీలేరు పట్టణం మార్కెట్ యార్డ్ ఆవరణలోని అన్న క్యాంటీన్ లో పేదలకు అన్నదానం చేశారు.

    ఈ సందర్భంగా పుట్టా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ నా తండ్రి పుట్టా కృష్ణారెడ్డి ప్రజాసేవనే ధ్యేయంగా జీవించారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా పేదలకు సేవ చేయడమే మాకు నిజమైన నివాళి అని అన్నారు.

    ఇవి కూడా చదవండి

    టిడిపి పీలేరు పట్టణ అధ్యక్షుడు దలవాయి సురేష్ కుమార్ రెడ్డి @ కంచి సూరి మాట్లాడుతూ పుట్టా కృష్ణారెడ్డి అందరితో కలిసి మెలిసి ఉండే వ్యక్తిత్వం కలిగి ఉండేవారు. ఆయన స్మృతిని పుట్టా రాజశేఖర్ రెడ్డి ఇలా అన్నదానం ద్వారా నిలుపుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు.


    పీలేరు మండలం ముడుపుల వేముల గ్రామం ఇన్చార్జి డాక్టర్ పల్లవోలు హేమచంద్రా రెడ్డి మాట్లాడుతూ పుట్టా కృష్ణారెడ్డి గారు పేదల పట్ల ఎంతో ఆదరణ చూపేవారు. ఆయన స్మృతిలో నిర్వహిస్తున్న ఈ అన్నదానం సామాజిక బాధ్యతకు నిదర్శనమని అన్నారు.

    ఈ కార్యక్రమంలో svss కృష్ణారెడ్డి, దేవులపల్లి చంద్రశేఖర్ రెడ్డి @DCR, ఖాజా తదితర టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

    అత్యధికంగా చదివినవి