Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • చవటపల్లి రవీంద్రనగర్‌లో అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్.

    చవటపల్లి రవీంద్రనగర్‌లో అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్.

    లక్కిరెడ్డిపల్లి, జూలై 7:

    లక్కిరెడ్డిపల్లి మండలంలోని అనంతపురం గ్రామపంచాయతీ పరిధిలోని చవటపల్లి రవీంద్రనగర్‌లో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మంగళవారం తనిఖీ చేశారు.

    ఈ సందర్భంగా ఇటీవల నిర్మించిన నూతన అంగన్‌వాడీ భవనాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్, కేంద్రంలో చిన్నారులకు అందిస్తున్న సేవలు, హాజరు నమోదు, పోషకాహార పంపిణీ, మెనూ అమలు, రక్తహీనత (అనీమియా), తక్కువ బరువు ఉన్న చిన్నారుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేంద్రంలో త్రాగునీటి సౌకర్యం, పారిశుద్ధ్యం, మరుగుదొడ్ల నిర్వహణ, వంటగది పరిశుభ్రత, ఆహార పదార్థాల నిల్వ, పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు.

    ఇవి కూడా చదవండి

    చిన్నారులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన పోషకాహారంతో పాటు స్వచ్ఛమైన త్రాగునీటిని అందించాలని, కేంద్రంలో ఎల్లప్పుడూ పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని అంగన్‌వాడీ సిబ్బందికి సూచించారు. చిన్నారుల ఆరోగ్య స్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ, అనీమియా మరియు పోషకాహార లోపం ఉన్న పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

    ఈ కార్యక్రమంలో తాసిల్దార్ క్రాంతి కుమార్, ఎంపీడీవో రెడ్డయ్య, ఆర్ ఐ రాజేష్ సంబంధిత అధికారులు, అంగన్వాడి సిబ్బంది, పిల్లలు తదితరులు పాల్గొన్నారు.
    ------------///-------------------
    డిఐపిఆర్వో, అన్నమయ్య జిల్లా.

    అత్యధికంగా చదివినవి