చవటపల్లి రవీంద్రనగర్‌లో అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్.

లక్కిరెడ్డిపల్లి, జూలై 7: లక్కిరెడ్డిపల్లి మండలంలోని అనంతపురం గ్రామపంచాయతీ పరిధిలోని చవటపల్లి రవీంద్రనగర్‌లో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇటీవల నిర్మించిన నూతన అంగన్‌వాడీ భవనాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్, కేంద్రంలో చిన్నారులకు అందిస్తున్న సేవలు, హాజరు నమోదు, పోషకాహార పంపిణీ, మెనూ అమలు, రక్తహీనత (అనీమియా), తక్కువ బరువు ఉన్న చిన్నారుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేంద్రంలో త్రాగునీటి సౌకర్యం, పారిశుద్ధ్యం, మరుగుదొడ్ల నిర్వహణ, వంటగది పరిశుభ్రత, ఆహార పదార్థాల నిల్వ, పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. చిన్నారులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన పోషకాహారంతో పాటు స్వచ్ఛమైన...