Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఆధునిక మౌలిక సదుపాయాలతో విద్యాభివృద్ధి సంతృప్తికరం పీఎం శ్రీ పాఠశాలలను సందర్శించిన సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ అనురాధ

    ఆధునిక మౌలిక సదుపాయాలతో విద్యాభివృద్ధి సంతృప్తికరం  పీఎం శ్రీ పాఠశాలలను సందర్శించిన సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ అనురాధ

    పీలేరు, జూలై 6 (రాజనీతి): కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న పీఎం శ్రీ (PM SHRI) పథకం కింద అభివృద్ధి చేసిన పాఠశాలలను అన్నమయ్య జిల్లా సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ అనురాధ సోమవారం సందర్శించారు.

    పీలేరు మండలంలోని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ డాక్టర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో పీఎం శ్రీ కింద చేపట్టిన అభివృద్ధి పనులను ఆమె పరిశీలించారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్స్ ల్యాబ్‌లు, ట్యాబ్‌లు, కిచెన్ గార్డెన్, క్లినికల్ ల్యాబ్, ఆరోగ్య పరికరాలు, సెలైన్ స్టాండ్, క్రీడా మైదానం తదితర సదుపాయాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.

    పీఎం శ్రీ పథకం ద్వారా వచ్చిన నిధులను ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించడం అభినందనీయమని ఆమె పేర్కొన్నారు. స్మార్ట్ తరగతులు, ఆధునిక బోధనా విధానాల ద్వారా విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యమని చెప్పారు.

    ఇవి కూడా చదవండి

    అనంతరం పీలేరు మండలంలోని మరో పీఎం శ్రీ పాఠశాల అయిన కోటపల్లి బాలుర ఉన్నత పాఠశాలను కూడా సందర్శించి అక్కడ చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

    ఈ కార్యక్రమంలో గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ డీహెచ్ చంద్రకళ, వ్యాయామ ఉపాధ్యాయులు పుష్పలత, ఉపాధ్యాయురాలు వరలక్ష్మి, సీఆర్‌పీ అశోక్ తదితరులు పాల్గొన్నారు.

    అత్యధికంగా చదివినవి