ఆధునిక మౌలిక సదుపాయాలతో విద్యాభివృద్ధి సంతృప్తికరం పీఎం శ్రీ పాఠశాలలను సందర్శించిన సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ అనురాధ
పీలేరు, జూలై 6 (రాజనీతి): కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న పీఎం శ్రీ (PM SHRI) పథకం కింద అభివృద్ధి చేసిన పాఠశాలలను అన్నమయ్య జిల్లా సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ అనురాధ సోమవారం సందర్శించారు. పీలేరు మండలంలోని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ డాక్టర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో పీఎం శ్రీ కింద చేపట్టిన అభివృద్ధి పనులను ఆమె పరిశీలించారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్స్ ల్యాబ్‌లు, ట్యాబ్‌లు, కిచెన్ గార్డెన్, క్లినికల్ ల్యాబ్, ఆరోగ్య పరికరాలు, సెలైన్ స్టాండ్, క్రీడా మైదానం తదితర సదుపాయాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పీఎం శ్రీ పథకం ద్వారా వచ్చిన నిధులను ఆధునిక...