Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • మన్యం వీరుడు అల్లూరి దేశభక్తి, ధైర్యాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్.

    మన్యం వీరుడు అల్లూరి దేశభక్తి, ధైర్యాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలి  జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్.

    మదనపల్లి , జూలై 4:

    స్వరాజ్య సంగ్రామ చరిత్రలో అల్లూరి ఒక మహోజ్వల శక్తి. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు దేశభక్తి, ధైర్యాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని నిశాంత్ కుమార్
    పేర్కొన్నారు.

    శనివారం మదనపల్లి కలెక్టరేట్లో లోని పి జి ఆర్ ఎస్ హాల్ నందు పర్యాటక మరియు యువజన సర్వీసుల శాఖ ల ఆధ్వర్యంలో శ్రీ అల్లూరి సీతారామరాజు 129 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి డిఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన గావించి ఘనంగా నివాళులు అర్పించారు.

    ఇవి కూడా చదవండి

    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. 1897 జూలై 4న విశాఖపట్నం జిల్లా పాండ్రంగి గ్రామంలో జన్మించిన అల్లూరి సీతారామరాజు చిన్న వయస్సులోనే దేశభక్తి భావాలతో ప్రజల పక్షాన నిలిచారని తెలిపారు. బ్రిటిష్ పాలనలో గిరిజనులపై జరుగుతున్న అన్యాయాలు, అణచివేత, వారి హక్కుల అణిచివేతను
    గుర్తించి వాటికి వ్యతిరేకంగా పోరాటానికి శ్రీకారం చుట్టారని తెలియజేశారు.

    1922 నుండి 1924 వరకు తూర్పు కనుమల అటవీ ప్రాంతాల్లో గిరిజనులను ఏకం చేసి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాహసోపేతమైన గెరిల్లా పోరాటాన్ని నడిపారని పేర్కొన్నారు. ఆయుధాలు, వనరులు తక్కువగా ఉన్నప్పటికీ విల్లు, బాణాలతోనే శక్తివంతమైన బ్రిటిష్ సైన్యాన్ని సవాలు చేయడం ఆయన అసాధారణ ధైర్యసాహసాలకు నిదర్శనమని కొనియాడారు. వీరి ఫలితమే 1882లో అమల్లోకి వచ్చిన మద్రాస్ ఫారెస్ట్ చట్టం వల్ల గిరిజనుల జీవనాధారమైన అటవీ ఉత్పత్తుల సేకరణపై ఆంక్షలు విధించడంతో వారు ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తించి, వారి హక్కుల పరిరక్షణ కోసం అల్లూరి పోరాడారని తెలిపారు. ఆయన ఉద్యమాన్ని అణచివేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం భారీ ఎత్తున బలగాలను మోహరించి, భారీ వ్యయం ఖర్చు చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు.అల్లూరి సీతారామరాజును పట్టుకోవడానికి బ్రిటిష్ ప్రభుత్వం బహుమతి ప్రకటించడం ఆయన పోరాట తీవ్రతకు నిదర్శనమని కలెక్టర్ అన్నారు. చివరకు 1924 మే నెలలో ఎలాంటి విచారణ, న్యాయ ప్రక్రియ లేకుండానే ఆయనను పట్టుకుని కాల్చి చంపడం భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో ఒక విషాద ఘట్టమని పేర్కొన్నారు.దేశం కోసం, ప్రజల హక్కుల కోసం తన ప్రాణాలను అర్పించిన అల్లూరి సీతారామరాజు త్యాగం చిరస్మరణీయమని, ఆయన ధైర్యం, దేశభక్తి, న్యాయం కోసం పోరాడే తత్వాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పిలుపునిచ్చారు.

    మన్యం వీరుడు అల్లూరి స్వాతంత్య్రం కోసం ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం చేసిన మహనీయుడన్నారు. ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. నిరక్షరాస్యులు, నిరుపేదలు, అమాయకులకు అండగా నిలిచి బ్రిటీషు సామ్రాజ్యమనే మహా శక్తిని ఢీకొన్నాడని, ఆయన చూపిన ధైర్యం తెగువ భావితరాలకు ఆదర్శం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ అధికారి నాగభూషణం,యువజన సర్వీసుల శాఖ పర్యవేక్షణ అధికారి వివి నారాయణ, నాగయ్య, కలెక్టర్ కార్యాలయం నాగభూషణం, కలెక్టర్ కార్యాలయం సిబ్బంది వివిధ శాఖల జిల్లా అధికారులు, విద్యార్థులు,సిబ్బంది పాల్గొన్నారు.
    ---------/////-------------
    ఏపిఆర్ఓ అన్నమయ్య జిల్లా.

    అత్యధికంగా చదివినవి