Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • చిత్తూరు ఏపీఎస్ఆర్టీసీ రెండోవ డిపోలో సేవలకు కొత్త ఊపు

    Author RAJANEETHI | 04 Jul 2026, 09:39 AM | చిత్తూరు
    చిత్తూరు ఏపీఎస్ఆర్టీసీ రెండోవ డిపోలో సేవలకు కొత్త ఊపు

    ప్రజా రవాణా వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దడంలో చిత్తూరు రెండోవ ఆర్టీసీ డిపో విశేష పురోగతి సాధిస్తోంది. డిపో మేనేజర్ రూపశ్రీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పరిపాలనలో పారదర్శకత సేవల్లో నాణ్యత ఆదాయ వృద్ధి ప్రయాణికుల సౌకర్యాల విస్తరణ వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వడంతో డిపో పనితీరులో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి.ప్రభుత్వ సంక్షేమ పథకాలను సమర్థంగా అమలు చేస్తూనే ప్రయాణికుల విశ్వాసాన్ని పెంపొందించే దిశగా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. డీఎం రూపశ్రీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రతి విభాగంలో క్రమశిక్షణ సమన్వయం బాధ్యతాయుతమైన పనితీరును ప్రోత్సహించారు. అధికారులు సిబ్బందితో తరచూ సమీక్షలు నిర్వహిస్తూ సమస్యలను వెంటనే పరిష్కరించే విధానాన్ని అవలంబించారు. ఫలితంగా డిపోలో సేవల నాణ్యత మెరుగుపడటంతో పాటు ఉద్యోగుల్లో పని పట్ల నిబద్ధత కూడా పెరిగింది.ప్రయాణికుల సంతృప్తే లక్ష్యంగా బస్సుల సమయపాలనపై ప్రత్యేక దృష్టి సారించారు. నిర్దేశిత సమయాలకు బస్సులు నడిచేలా చర్యలు తీసుకోవడంతో విద్యార్థులు ఉద్యోగులు వ్యాపారులు గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారింది. బస్సుల పరిశుభ్రత సాంకేతిక నిర్వహణ భద్రతా ప్రమాణాల అమలులో రాజీ లేకుండా చర్యలు కొనసాగుతున్నాయి. డిపో ఆదాయాన్ని పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ప్రయాణికుల సంఖ్య పెంచేందుకు ప్రచార కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ఖాళీ సీట్ల శాతం తగ్గించే చర్యలు తీసుకున్నారు. రద్దీ సమయాల్లో అదనపు బస్సులు నడపడం అవసరమైన చోట ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేయడం ద్వారా ఆదాయ వృద్ధికి తోడ్పడ్డారు. ప్రతి మార్గంపై ఆదాయ వ్యయాలను విశ్లేషిస్తూ అవసరమైన మార్పులు చేస్తూ డిపో ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అమలులో చిత్తూరు ఒకటవ డిపో ముందంజలో నిలుస్తోంది. మహిళలు,విద్యార్థులు, వృద్ధులు, దివ్యాంగులు తదితర వర్గాలకు ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలను పారదర్శకంగా అమలు చేస్తున్నారు. అర్హులందరికీ పథకాల ప్రయోజనాలు అందేలా సిబ్బందికి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు.ప్రయాణికుల నుంచి వచ్చే ఫిర్యాదులు సూచనలను సానుకూలంగా స్వీకరిస్తూ వెంటనే స్పందించే విధానాన్ని అమలు చేస్తున్నారు. చిన్న సమస్య అయినా నిర్లక్ష్యం చేయకుండా పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. దీంతో ప్రయాణికుల్లో డిపోపై విశ్వాసం పెరిగింది. ప్రజలకు మరింత చేరువ కావాలనే లక్ష్యంతో సేవాభావంతో కూడిన పరిపాలనను కొనసాగిస్తున్నారు.డిపోలోని డ్రైవర్లు, కండక్టర్లు, సాంకేతిక సిబ్బందికి కాలానుగుణంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ రోడ్డు భద్రత ప్రయాణికులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించడం ప్రమాదాల నివారణ ఇంధన పొదుపు వంటి అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. దీనివల్ల సేవల నాణ్యత మరింత మెరుగుపడుతోంది.బస్సుల నిర్వహణలో సాంకేతిక ప్రమాణాలకు ప్రాధాన్యం ఇస్తూ వాహనాల ఫిట్‌నెస్‌పై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోంది. ప్రయాణికుల భద్రతకు ఎలాంటి లోటు లేకుండా వాహనాలను సకాలంలో మరమ్మతులు చేయిస్తూ రోడ్లపైకి పంపుతున్నారు. దీంతో మధ్యలో బస్సులు నిలిచిపోవడం వంటి ఘటనలు తగ్గుముఖం పట్టాయి.పండుగలు ప్రత్యేక సందర్భాల్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు సర్వీసులు నడపడం ముందస్తు ప్రణాళికతో బస్సులను అందుబాటులో ఉంచడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో కూడా సత్వర చర్యలు తీసుకుంటూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూస్తున్నారు.డిజిటల్ సేవల వినియోగాన్ని కూడా ప్రోత్సహిస్తున్నారు. ఆన్‌లైన్ రిజర్వేషన్ డిజిటల్ చెల్లింపులు యూపీఐ ద్వారా టికెట్ చెల్లింపులు వంటి సేవలపై ప్రయాణికులకు అవగాహన కల్పిస్తూ నగదు రహిత లావాదేవీలను పెంచుతున్నారు. దీంతో టికెట్ జారీ ప్రక్రియ వేగవంతమై పారదర్శకత కూడా పెరిగింది. ఉద్యోగుల సంక్షేమానికి కూడా డీఎం రూపశ్రీ సమాన ప్రాధాన్యం ఇస్తున్నారు. విధుల నిర్వహణలో ఎదురయ్యే సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఉద్యోగుల్లో జట్టుగా పనిచేసే భావన పెంపొందిస్తూ సంస్థ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. స్వచ్ఛమైన డిపో పరిశుభ్రమైన బస్సులు క్రమబద్ధమైన పరిపాలన ప్రజల పట్ల బాధ్యతాయుతమైన సేవలతో చిత్తూరు ఒకటవ డిపో ప్రత్యేక గుర్తింపు పొందుతోంది. ప్రయాణికుల అభిప్రాయాలను గౌరవిస్తూ సేవలను నిరంతరం మెరుగుపరచాలనే లక్ష్యంతో అధికారులు పనిచేస్తున్నారు. ఆదాయ వృద్ధి, సేవల నాణ్యత, ప్రభుత్వ సంక్షేమ పథకాల సమర్థ అమలు, ప్రజల విశ్వాసం, ఉద్యోగుల సమన్వయం వంటి అంశాల్లో చిత్తూరు ఒకటవ డిపో సాధిస్తున్న పురోగతి ఇతర డిపోలకు ఆదర్శంగా నిలుస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో కూడా ప్రజలకు మరింత మెరుగైన సురక్షితమైన సమయపాలనతో కూడిన రవాణా సేవలు అందించాలనే సంకల్పంతో డీఎం రూపశ్రీ ఆధ్వర్యంలో చిత్తూరు రెండోవ డిపో ముందుకు సాగుతోంది.

    చిత్తూరు ఏపీఎస్ఆర్టీసీ రెండోవ డిపోలో సేవలకు కొత్త ఊపు - Additional Image