చిత్తూరు ఏపీఎస్ఆర్టీసీ రెండోవ డిపోలో సేవలకు కొత్త ఊపు

ప్రజా రవాణా వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దడంలో చిత్తూరు రెండోవ ఆర్టీసీ డిపో విశేష పురోగతి సాధిస్తోంది. డిపో మేనేజర్ రూపశ్రీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పరిపాలనలో పారదర్శకత సేవల్లో నాణ్యత ఆదాయ వృద్ధి ప్రయాణికుల సౌకర్యాల విస్తరణ వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వడంతో డిపో పనితీరులో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి.ప్రభుత్వ సంక్షేమ పథకాలను సమర్థంగా అమలు చేస్తూనే ప్రయాణికుల విశ్వాసాన్ని పెంపొందించే దిశగా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. డీఎం రూపశ్రీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రతి విభాగంలో క్రమశిక్షణ సమన్వయం బాధ్యతాయుతమైన పనితీరును ప్రోత్సహించారు. అధికారులు సిబ్బందితో తరచూ సమీక్షలు నిర్వహిస్తూ సమస్యలను వెంటనే పరిష్కరించే విధానాన్ని అవలంబించారు. ఫలితంగా డిపోలో సేవల...