Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • డిజిటల్ విద్యకు సీతమ్స్‌లో నూతన ఊతం..వీడియో లెక్చర్ రికార్డింగ్ స్టూడియో ప్రారంభం

    Author RAJANEETHI | 03 Jul 2026, 07:07 PM | చిత్తూరు
    డిజిటల్ విద్యకు సీతమ్స్‌లో నూతన ఊతం..వీడియో లెక్చర్ రికార్డింగ్ స్టూడియో ప్రారంభం

    డిజిటల్ విద్యకు మరింత బలం చేకూర్చే దిశగా చిత్తూరులోని శ్రీనివాస ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ (సీతమ్స్) మరో కీలక ముందడుగు వేసింది. విద్యార్థుల్లో స్వీయ అభ్యాసాన్ని ప్రోత్సహించడంతో పాటు సాంకేతికత ఆధారిత బోధనను విస్తరించేందుకు అత్యాధునిక వీడియో లెక్చర్ రికార్డింగ్ స్టూడియోను శుక్రవారం ప్రారంభించింది. సంస్థ మేనేజ్‌మెంట్ ట్రస్టీ డా. డి.ఎ. కల్పజ, చైర్మన్ కె. రంగనాథం సహకారంతో ఏర్పాటు చేసిన ఈ స్టూడియో ద్వారా అధ్యాపకులు నాణ్యమైన వీడియో పాఠాలను రూపొందించి విద్యార్థులకు అందించే అవకాశం కలుగనుంది. తరగతి గదిలో బోధనతో పాటు డిజిటల్ వేదికల ద్వారా కూడా విద్యార్థులు ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా పాఠాలను అభ్యసించేందుకు ఈ సౌకర్యం దోహదపడనుంది. ఈ స్టూడియో ప్రారంభోత్సవ కార్యక్రమంలో అకాడెమిక్ అడ్వైజర్ డా. కె.ఎల్. నారాయణ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రొఫెసర్ కె. నాగేంద్ర ప్రసాద్, ప్రిన్సిపాల్ డా. ఎన్. వెంకటచలపతి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. డిజిటల్ విద్య భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని సంస్థ తీసుకుంటున్న చర్యలను వారు అభినందించారు.చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రొఫెసర్ కె. నాగేంద్ర ప్రసాద్ దూరదృష్టితో ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. విద్యార్థులు తమకు అనుకూలమైన సమయంలో పాఠాలను అభ్యసించే సెల్ఫ్-లెర్నింగ్ తరగతి బోధనతో పాటు ఆన్‌లైన్ బోధనను సమన్వయం చేసే బ్లెండెడ్ లెర్నింగ్ విధానాలకు ఈ స్టూడియో తోడ్పాటునందిస్తుందని పేర్కొన్నారు. అంతేకాకుండా అధ్యాపకులు ఆధునిక బోధనా పద్ధతులకు అనుగుణంగా డిజిటల్ కంటెంట్ రూపొందించే అవకాశం కూడా లభిస్తుందని వివరించారు.ఈఈఈ విభాగం ప్రొఫెసర్ డా. మహేశ్వరి, సంస్థ వీడియో లెక్చర్ సిరీస్ కోఆర్డినేటర్‌గా వ్యవహరిస్తూ రిబ్బన్ కట్ చేసి స్టూడియోను అధికారికంగా ప్రారంభించారు. అనంతరం స్టూడియోలో అందుబాటులో ఉన్న ఆధునిక కెమెరాలు, లైటింగ్, ఆడియో రికార్డింగ్ వ్యవస్థలు, డిజిటల్ కంటెంట్ తయారీ సౌకర్యాలను అతిథులు పరిశీలించారు. జాతీయ విద్యా విధానం–2020లో ప్రతిపాదించిన విద్యార్థి కేంద్రిత బోధన సాంకేతికత ఆధారిత విద్య నైపుణ్యాభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా ఈ స్టూడియో ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. డిజిటల్ వనరుల ద్వారా విద్యార్థులు పాఠాలను పలుమార్లు వీక్షిస్తూ సులభంగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుందని పరీక్షల సమయంలో కూడా ఈ వీడియోలు ఎంతో ఉపయోగకరంగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో ఉన్నత విద్యలో డిజిటల్ లెర్నింగ్‌కు పెరుగుతున్న ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని సీతమ్స్ యాజమాన్యం విద్యా మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా వారిని సన్నద్ధం చేయడమే లక్ష్యంగా ఇలాంటి ఆధునిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. డిజిటల్ విద్యాభివృద్ధి దిశగా సీతమ్స్ చేపట్టిన ఈ కార్యక్రమం విద్యార్థులకు మరింత నాణ్యమైన బోధన అందించడంతో పాటు సంస్థ ప్రతిష్ఠను మరింత పెంచుతుందని పలువురు అభిప్రాయపడ్డారు.