డిజిటల్ విద్యకు సీతమ్స్లో నూతన ఊతం..వీడియో లెక్చర్ రికార్డింగ్ స్టూడియో ప్రారంభం
డిజిటల్ విద్యకు మరింత బలం చేకూర్చే దిశగా చిత్తూరులోని శ్రీనివాస ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్ (సీతమ్స్) మరో కీలక ముందడుగు వేసింది. విద్యార్థుల్లో స్వీయ అభ్యాసాన్ని ప్రోత్సహించడంతో పాటు సాంకేతికత ఆధారిత బోధనను విస్తరించేందుకు అత్యాధునిక వీడియో లెక్చర్ రికార్డింగ్ స్టూడియోను శుక్రవారం ప్రారంభించింది. సంస్థ మేనేజ్మెంట్ ట్రస్టీ డా. డి.ఎ. కల్పజ, చైర్మన్ కె. రంగనాథం సహకారంతో ఏర్పాటు చేసిన ఈ స్టూడియో ద్వారా అధ్యాపకులు నాణ్యమైన వీడియో పాఠాలను రూపొందించి విద్యార్థులకు అందించే అవకాశం కలుగనుంది. తరగతి గదిలో బోధనతో పాటు డిజిటల్ వేదికల ద్వారా కూడా విద్యార్థులు ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా పాఠాలను అభ్యసించేందుకు ఈ సౌకర్యం...