Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • శ్రీసిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీని ప్రారంభించిన మంత్రి నారా లోకేష్

    శ్రీసిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీని ప్రారంభించిన మంత్రి నారా లోకేష్

    శ్రీసిటీ, జూలై 2 (రాజనీతి): ఆంధ్రప్రదేశ్‌ను విద్య, ఉపాధి రంగాల్లో దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దే లక్ష్యంతో విద్య–పరిశ్రమల అనుసంధానానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. గురువారం శ్రీసిటీలోని తాత్కాలిక క్యాంపస్‌లో శ్రీసిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ (SIU)ని ఆయన ప్రారంభించారు.

    ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, యువతకు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు అందించే విద్యా విధానం అవసరమని పేర్కొన్నారు. శ్రీసిటీలోని బలమైన పారిశ్రామిక వాతావరణం, 31 దేశాలకు చెందిన 250కుపైగా కంపెనీల భాగస్వామ్యంతో అమలవుతున్న వర్క్–స్టడీ డ్యూయల్ మోడల్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఈ విధానంలో విద్యార్థులు చదువుతో పాటు పరిశ్రమల్లో ఇంటర్న్‌షిప్‌లు చేస్తూ అనుభవాన్ని సంపాదించే అవకాశం కలుగుతుందని తెలిపారు.

    శ్రీసిటీ ఎడ్యుకేషన్ ఫౌండేషన్, ఎస్‌ఐయూ పాలకమండలి ఛైర్మన్ శ్రీనిరాజు మాట్లాడుతూ, నాలుగేళ్ల డిగ్రీ పూర్తయ్యే నాటికి విద్యార్థులు రెండేళ్లకు పైగా పరిశ్రమ అనుభవంతో పాటు మెరుగైన ఉపాధి అవకాశాలతో బయటకు వస్తారని తెలిపారు. మొదటి సంవత్సరం నుంచే విద్యార్థులకు నెలకు కనీసం రూ.10 వేల స్టైఫండ్ అందించే విధంగా పరిశ్రమలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని చెప్పారు.

    ఇవి కూడా చదవండి

    విద్యార్థులలో వ్యవస్థాపకతను ప్రోత్సహించేందుకు ‘స్టేషన్–ఎస్’ ఇంక్యుబేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కృత్రిమ మేధస్సు ఆధారిత సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా ప్రతి సంవత్సరం పాఠ్యాంశాలను నవీకరిస్తున్నట్లు వెల్లడించారు.

    2026–27 విద్యా సంవత్సరానికి బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, అడ్వాన్స్‌డ్ మ్యానుఫ్యాక్చరింగ్, బీబీఏ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, డిజిటల్ మీడియా అండ్ కమ్యూనికేషన్స్ కోర్సుల్లో ప్రవేశాలు ప్రారంభమైనట్లు యాజమాన్యం తెలిపింది.

    కార్యక్రమంలో శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి, ఎస్‌ఐయూ గ్లోబల్ అడ్వైజరీ కౌన్సిల్ సభ్యులు, పాలక మండలి ప్రతినిధులు, పరిశ్రమల ప్రతినిధులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

    అత్యధికంగా చదివినవి