శ్రీసిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీని ప్రారంభించిన మంత్రి నారా లోకేష్
శ్రీసిటీ, జూలై 2 (రాజనీతి): ఆంధ్రప్రదేశ్‌ను విద్య, ఉపాధి రంగాల్లో దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దే లక్ష్యంతో విద్య–పరిశ్రమల అనుసంధానానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. గురువారం శ్రీసిటీలోని తాత్కాలిక క్యాంపస్‌లో శ్రీసిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ (SIU)ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, యువతకు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు అందించే విద్యా విధానం అవసరమని పేర్కొన్నారు. శ్రీసిటీలోని బలమైన పారిశ్రామిక వాతావరణం, 31 దేశాలకు చెందిన 250కుపైగా కంపెనీల భాగస్వామ్యంతో అమలవుతున్న వర్క్–స్టడీ డ్యూయల్ మోడల్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఈ విధానంలో...