Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ప్రభుత్వ పాఠశాలలకు దాతల వితరణ.. విద్యార్థులకు వరం

    ప్రభుత్వ పాఠశాలలకు దాతల వితరణ.. విద్యార్థులకు వరం

    సమాజ సేవలో దాతలు ముందుకు రావడం అభినందనీయం : ఎంఈవో బాబు నాయక్

    పీలేరు, జూలై 2 (రాజనీతి ప్రతినిధి ): ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు దాతలు అందిస్తున్న సహాయం వారి విద్యాభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని మండల విద్యాశాఖ అధికారి బాబు నాయక్ అన్నారు. పీలేరు మండలం లక్ష్మీపురం మండల పరిషత్ ప్రాథమిక ఆదర్శ పాఠశాలలో గురువారం ఏ.బీ.సీ. సంస్థ చైర్మన్ శ్రీమతి సుమలత తన తండ్రి రాజేంద్ర ఆచారి తరఫున సుమారు రూ.10 వేల విలువైన నోటుబుక్స్, పెన్నులు, పెన్సిళ్లు, ఎరేజర్లు, కంపాస్ బాక్సులు, పలకలు తదితర విద్యాసామగ్రిని విద్యార్థులకు పంపిణీ చేశారు.

    ఈ కార్యక్రమం మండల విద్యాశాఖ అధికారులు బాబు నాయక్, పద్మావతి ఆధ్వర్యంలో, ప్రధానోపాధ్యాయులు రామకృష్ణ అధ్యక్షతన నిర్వహించారు.

    ఇవి కూడా చదవండి

    ఈ సందర్భంగా ఎంఈవో బాబు నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో అత్యధికులు నిరుపేద కుటుంబాలకు చెందిన వారేనని, ప్రభుత్వం అందించే సౌకర్యాలకు తోడు దాతలు తమ వంతు సహకారం అందించడం ఎంతో గొప్ప విషయమన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం సమాజంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలలకు అండగా నిలవాలని కోరారు. దాతలు అందించిన విద్యాసామగ్రి విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని, తల్లిదండ్రుల ఆర్థిక భారాన్ని తగ్గించడంలో ఇటువంటి సేవా కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.

    ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి పద్మావతి, ప్రధానోపాధ్యాయులు రామకృష్ణ, ఉపాధ్యాయులు రేఖ, మమత, సురేష్, సీఆర్పీ శ్వేత, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

    అత్యధికంగా చదివినవి