ప్రభుత్వ పాఠశాలలకు దాతల వితరణ.. విద్యార్థులకు వరం

సమాజ సేవలో దాతలు ముందుకు రావడం అభినందనీయం : ఎంఈవో బాబు నాయక్ పీలేరు, జూలై 2 (రాజనీతి ప్రతినిధి ): ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు దాతలు అందిస్తున్న సహాయం వారి విద్యాభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని మండల విద్యాశాఖ అధికారి బాబు నాయక్ అన్నారు. పీలేరు మండలం లక్ష్మీపురం మండల పరిషత్ ప్రాథమిక ఆదర్శ పాఠశాలలో గురువారం ఏ.బీ.సీ. సంస్థ చైర్మన్ శ్రీమతి సుమలత తన తండ్రి రాజేంద్ర ఆచారి తరఫున సుమారు రూ.10 వేల విలువైన నోటుబుక్స్, పెన్నులు, పెన్సిళ్లు, ఎరేజర్లు, కంపాస్ బాక్సులు, పలకలు తదితర విద్యాసామగ్రిని విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం మండల విద్యాశాఖ అధికారులు బాబు...