Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • మూడు పద్ధతులు పాటిద్దాం -డెంగీ ని ఒడిద్దాం. డి. ఎమ్. హెచ్. ఓ డాక్టర్ లక్ష్మీనరసయ్య

    మూడు పద్ధతులు పాటిద్దాం -డెంగీ ని ఒడిద్దాం. డి. ఎమ్. హెచ్. ఓ డాక్టర్ లక్ష్మీనరసయ్య

    మదనపల్లి 2/7/26
    మూడు పద్ధతులు పాటిద్దాం -డెంగీ ని ఒడిద్దాం అని అన్నమయ్య జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ లక్ష్మీనరసయ్య మరియు జిల్లా మలేరియా అధికారి రామచంద్రారెడ్డిలు సంయుక్తంగా పిలుపునిచ్చారు. డెంగీ వ్యతిరేక మాసోత్చావాల సందర్బంగా జిల్లా కేంద్రం మదనపల్లి లోని డి. ఎమ్. హెచ్. ఓ. కార్యాలయం నుండి భారీ ర్యాలీని జెండా ఊపి డి. ఎమ్. హెచ్. ఓ ప్రారంభించారు. ఈ సందర్బంగా డి. ఎమ్. హెచ్. ఓ. డాక్టర్ లక్ష్మీనరసయ్య, డి ఎమ్. ఓ. రామచంద్రారెడ్డిలు మాట్లాడుచు ఈ సంవత్సరము డెంగీ వ్యతిరేక మాసోత్చావాల తీమ్ "మూడు పద్ధతులు (పరిశీలించండి, శుభ్రపరచండి, మూతలు పెట్టండి )పాటిద్దాం -డెంగీ ని ఒడిద్దాం "అని ప్రభుత్వం పిలుపు నిచ్చింది అన్నారు. ప్రస్తుతం డెంగీ జ్వరాలు ఒక ప్రజా ఆరోగ్య సమస్య గా ఉందని ప్రజల్లో చైతన్యం, అవగాహన తోనే దోమల నియంత్రణ సాధ్యం అని అన్నారు. జిల్లా మలేరియా అధికారి రామచంద్ర రెడ్డి మాట్లాడుచు ప్రతీ శుక్రవారం డ్రై డే గా పాటిస్తూ, ఇంటి పరిసరాలు పరిశీలించి నీటి నిల్వలు లేకుండా శుభ్రపరచుకొని నీటి నిల్వల పైన మూతలు ఉంచాలని ఈ విధమైన చైతన్యం ప్రతీ ఇంటిలో రావాలని వచ్చే విదంగా ఆరోగ్య సిబ్బంది అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. అనంతరం నినాదలు చేస్తూ కార్యాలయం నుండి అనిబెసెంట్ సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది అనంతరం డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ నినాదాలు చేయిస్తూ డెంగీ వ్యతిరేక మాసోత్చావాలా ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమం లో డి. ఎమ్. హెచ్. ఓ. డాక్టర్ లక్ష్మీనరసయ్య,జిల్లా టి. బి. అధికారి డాక్టర్ రాధిక, పరిపాలన అధికారి డాక్టర్ మధుసూదన్ రెడ్డి, ఆర్. బి. ఎస్. కే. జిల్లా ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి, జిల్లా మలేరియా అధికారి రామచంద్ర రెడ్డి, ఎస్. ఓ. ఓబుల్ రెడ్డి,డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ , సబ్ యూనిట్ అధికారి ఖలీలుళ్ళాఖాన్, ఎల్ టి. శివ,ఎస్. టి. ఎస్. ప్రభాకర్,హెల్త్ అసిస్టెంట్ కిరణ్ , పట్టణ ఆరోగ్య కేంద్ర ఏ. ఎన్. ఎమ్ లు, ఆశాకార్యకర్తలు,కార్యాలయ సిబ్బంది సిబ్బంది మరియు ప్రజలు పాల్గొన్నారు.

    అత్యధికంగా చదివినవి