Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం అంతర్జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ విద్య క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • డాక్టర్స్ డే సందర్భంగా కలికిరిలో ఘనంగా హెల్తీ 5K రన్ నిర్వహణ

    డాక్టర్స్ డే సందర్భంగా కలికిరిలో ఘనంగా హెల్తీ 5K రన్ నిర్వహణ

    కలికిరి, జూలై 1:

    డాక్టర్స్ డే సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA), పీలేరు మరియు కపిలేశ్వర హాస్పిటల్స్, కలికిరి సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం ఉదయం 6.00 గంటలకు కలికిరి క్రాస్ రోడ్స్ నుండి నిర్వహించిన హెల్తీ 5K రన్ కార్యక్రమం ఘన విజయాన్ని సాధించింది. ఈ కార్యక్రమంలో సుమారు 250 మంది వైద్యులు, దంత వైద్యులు, వైద్య విద్యార్థులు, ఆరోగ్య సిబ్బంది మరియు ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

    కార్యక్రమానికి హాజరైన వారందరికీ ప్రారంభ స్థలంలో నిర్వాహకులు రిజిస్ట్రేషన్ నిర్వహించి, రన్నింగ్ నంబర్లను అందజేశారు.

    అనంతరం కలికిరి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ అనిల్ గారు పాల్గొన్న వారికి రోడ్డు భద్రతా నియమాలు, రన్ సందర్భంగా పాటించాల్సిన సూచనలను వివరించి, నిర్వాహకులతో కలిసి పచ్చజెండా ఊపి 5K రన్‌ను ప్రారంభించారు.

    రన్ ప్రారంభమైన తర్వాత ముందుగా పోలీస్ ప్యాట్రోల్ వాహనం భద్రత కల్పించగా, చివరగా అంబులెన్స్ ఫాలో అవుతూ అత్యవసర వైద్య సేవలను అందించేందుకు సిద్ధంగా ఉండింది. అలాగే ప్రతి 500 మీటర్లకు హైడ్రేషన్ పాయింట్లు ఏర్పాటు చేసి, తాగునీరు మరియు గ్లూకోజ్-డి కలిపిన నీరు అందుబాటులో ఉంచడం ద్వారా పాల్గొన్న వారందరికీ అవసరమైన సౌకర్యాలు కల్పించారు.

    రన్ ముగిసిన అనంతరం కపిలేశ్వర హాస్పిటల్ ప్రాంగణంలో విజేతలకు మెడల్స్ ప్రదానం చేశారు.

    ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న బ్రిగేడియర్ అనుపమ్ శర్మ, DIG, CIAT-03, CRPF, కలికిరి మాట్లాడుతూ వైద్యులందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసి, సమాజ ఆరోగ్య పరిరక్షణలో వైద్యుల సేవలు అమూల్యమైనవని కొనియాడారు.

    ఇవి కూడా చదవండి

    సైనిక్ స్కూల్ ఫస్ట్ లేడీ శ్రీమతి కమలాజిత్ కౌర్ మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే వైద్యులు కూడా తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.

    కలికిరి మహిళా డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ శ్రీమతి గులాబ్ జాన్ మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవర్చుకోవడంలో ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు.

    IMA పీలేరు అధ్యక్షులు డా. ఆర్. రాజాసాహెబ్ మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన కపిలేశ్వర హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డా. శివప్రసాద్ సి.వి., సహకరించిన ప్రభుత్వ ఆసుపత్రి కలికిరి వైద్యాధికారి డా. వై. పవన్ కుమార్, అలాగే కార్యక్రమ విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు.

    జిల్లా ఎన్టీఆర్ వైద్య సేవా కోఆర్డినేటర్ డా. కె. లోకవర్ధన్ మాట్లాడుతూ సమాజ ఆరోగ్యానికి ఉపయోగపడే ఇలాంటి కార్యక్రమాలకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని తెలిపారు.

    పీలేరు ఏరియా ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డా. పి. చంద్రశేఖర్ పర్యవేక్షణలో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ IMA పీలేరు అధ్యక్షులు డా. ఆర్. రాజాసాహెబ్ మరియు కార్యదర్శి డా. చంద్రశేఖర్ నాయక్ నాయకత్వంలో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడినందుకు వారిని ప్రత్యేకంగా అభినందించారు.

    ఈ కార్యక్రమంలో కపిలేశ్వర హాస్పిటల్స్‌కు చెందిన డా. శివప్రసాద్ సి.వి., డా. ఆర్. ఎం. హిమబిందు, SPS హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డా. షేక్ మహమ్మద్ వసీమ్, డా. షేక్ సిమ్రాన్, డా. శివయోగి సోమశేఖర్, IDA పీలేరు తరఫున డా. పి. రామమోహన్ రెడ్డి మరియు IDA సభ్యులు, వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు చెందిన వైద్యులు, దంత వైద్యులు, వైద్య సిబ్బంది, వైద్య విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

    “మన ఆరోగ్యం – మన బాధ్యత” అనే సందేశంతో నిర్వహించిన ఈ హెల్తీ 5K రన్ పాల్గొన్న వారందరిలో ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందించడంతో పాటు డాక్టర్స్ డే వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

    అత్యధికంగా చదివినవి